H-1B Visa: ఈ రంగాల వారికి బిగ్ షాక్.. హెచ్‌-1బీ వీసాల్లో మళ్లీ మార్పులు.. ఇక వెళ్లడం కష్టమే!

ఇటీవల హెచ్‌-1బీ వీసా విషయంలో లక్ష డాలర్ల ఫీజు విధించారు. ఇప్పుడు ఈ వీసా విషయంలో మరికొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. రిఫార్మింగ్‌ ద హెచ్‌-1బీ నాన్‌ఇమిగ్రెంట్స్‌ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్‌ కింద కొత్త మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా విషయంలో ఇప్పటికే పలు మార్పులు చేశారు. ఇటీవల హెచ్‌-1బీ వీసా విషయంలో లక్ష డాలర్ల ఫీజు విధించారు. ఇప్పుడు ఈ వీసా విషయంలో మరికొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. రిఫార్మింగ్‌ ద హెచ్‌-1బీ నాన్‌ఇమిగ్రెంట్స్‌ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్‌ కింద ఈ కొత్త మార్పులు తీసుకురానున్నట్లు ఫెడరల్ రిజిస్టర్‌లో నమోదైనట్లు తెలుస్తోంది. అయితే వీసా పరిమితి మినహాయింపుల అర్హతను బట్టి కఠినం చేయనున్నారు. అలాగే వీసా ప్రోగ్రామ్ నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై కూడా దృష్టి పెట్టనున్నారు.

ఇది కూడా చూడండి: Donald Trump Nobel Prize: ట్రంప్‌కు నోబెల్‌ అకాడమీ బిగ్‌షాక్.. ఇక ఆ ప్రైజ్ రానట్టేనా?

ఇది కూడా చూడండి: Trump Nobel: ఏమీ చేయని వాళ్ళకు ఇచ్చారు..ఒబామాకు నోబెల్ రావడంపై ట్రంప్ అక్కసు

భారతీయ విద్యార్థులపై ఎఫెక్ట్..

ఈ మార్పుల వల్ల హెచ్ 1బీ వీసా వల్ల యూఎస్ కార్మికుల వేతనాలు, పని ప్రదేశాల్లో పరిస్థితులకు రక్షణ కల్పి్ంచడం కోసం తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.  ఈ కొత్త రూల్ వల్ల విశ్వ విద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, హెల్త్ కేర్ సంస్థలు ప్రయోజనాలను పొందలేవు. అలాగే అమెరికా వెళ్లి చదవాలని అనుకుంటున్న ఎందరో భారతీయ విద్యార్థుల కల నెరవేరదు. అయితే ఈ కొత్త నిబంధనలు అన్ని కూడా ఈ ఏడాది డిసెంబర్‌లో వెలువడే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు