/rtv/media/media_files/2025/10/10/maria-corina-machado-pic-six-2025-10-10-15-43-35.jpeg)
మారియా ఆండ్రెస్ బెల్లో కాథలిక్ యూనివర్శిటీ నుంచి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, ఇన్స్టిట్యూటో డి ఎస్టూడియోస్ సుపీరియోరెస్ డి అడ్మినిస్ట్రేషన్ (IESA) నుండి ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
/rtv/media/media_files/2025/10/10/maria-corina-machado-pic-seven-2025-10-10-15-43-35.jpeg)
మారియా రాజకీయాల్లోకి రాకముందు కారాకస్ నగరంలో వీధి బాలలు, అనాథ పిల్లల సంక్షేమం కోసం అటెనియా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. మారియా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా సామాజిక సేవ కార్యక్రమాలు చేసేవారు. ఇదే ఆమె రాజకీయ దృక్పథాన్ని ప్రభావితం చేసింది.
/rtv/media/media_files/2025/10/10/maria-corina-machado-pic-eight-2025-10-10-15-43-35.jpeg)
2002లో, ఆమె 'సుమేట్' అనే పౌర సంస్థను కూడా స్థాపించారు. ఈ సంస్థ ఎన్నికల పారదర్శకత, పౌరుల ఓటింగ్ హక్కులను కాపాడటం దీని ముఖ్య ఉద్దేశం. ''తుపాకీ తూటాల కన్నా బ్యాలెట్ ఓట్లే ముఖ్యం" అనే నినాదంతో ఆమె ప్రజలను చైతన్యపరిచారు. శాంతియుత రాజకీయ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు.
/rtv/media/media_files/2025/10/10/maria-corina-machado-pic-four-2025-10-10-15-43-35.jpeg)
'సుమేట్' సంస్థ ద్వారా మారియా అప్పటి అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌కు వ్యతిరేకంగా 2004లో రికాల్ రిఫరెండం నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ప్రభుత్వం ఆమెపై దేశ ద్రోహం, కుట్ర కేసులు నమోదు చేసింది.
/rtv/media/media_files/2025/10/10/maria-corina-machado-pic-three-2025-10-10-15-43-36.jpeg)
ఆ తర్వాత 2010లో జరిగిన ఎన్నికల్లో ఆమె జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) సభ్యురాలిగా, దేశంలోనే అత్యధిక ఓట్లతో గెలిచారు. పార్లమెంట్లో మారియా అధికార పక్షం నికోలస్ మదురో ప్రభుత్వ విధానాలను నిస్సంకోచంగా, గట్టిగా విమర్శించారు.
/rtv/media/media_files/2025/10/10/maria-corina-machado-pic-two-2025-10-10-15-43-36.jpeg)
2014లో, వెనిజులాలో మానవ హక్కుల ఉల్లంఘనపై మారియా ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్' లో ప్రసంగించినందుకు ప్రభుత్వం ఆమెను ఎంపీ పదవి నుంచి అక్రమంగా తొలగించారు. ఆ తర్వాత ఆమె 'వెంటె వెనిజులా' అనే లిబరల్ రాజకీయ పార్టీని స్థాపించి.. దానికి జాతీయ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/10/maria-corina-machado-pic-one-2025-10-10-15-43-36.jpeg)
నియంతృత్వ పాలనలో పెరిగిన అణచివేత, అరెస్టులు, బెదిరింపులకు భయపడకుండా దేశంలోనే ఉండి తన పోరాటాన్ని కొనసాగించినందుకు ఆమెకు "వెనిజులా ఐరన్ లేడీ" అనే బిరుదు వచ్చింది.
/rtv/media/media_files/2025/10/10/screenshot-2025-10-10-153443-2025-10-10-15-43-36.png)
2023లో జరిగిన ప్రతిపక్ష ప్రైమరీ ఎన్నికల్లో మదురో ప్రభుత్వానికి దీటుగా బరిలోకి దిగి పోటీ చేశారు. అద్భుతమైన విజయం సాధించి.. అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయ్యారు. కానీ, ప్రభుత్వం ఆమెపై ఉన్న కేసులు, ఇతర కారణాలను చూపించి 15 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది.
/rtv/media/media_files/2025/10/10/screenshot-2025-10-10-153548-2025-10-10-15-43-36.png)
అనర్హత వేటు, ప్రాణాలకు ముప్పు ఉన్నా ఆమె దేశం విడిచి వెళ్లలేదు. ఆమె రహస్యంగా ఉంటూనే.. ప్రతిపక్షాలను ఏకం చేస్తూ శాంతియుత మార్పు కోసం ప్రజలను ప్రేరేపిస్తూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తన వ్యక్తిగత భద్రతను లెక్కచేయకుండా, తన దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె చేసిన శాంతియుత పోరాటం, కృషికి ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.