/rtv/media/media_files/2025/10/10/trump-2025-10-10-17-20-34.jpg)
నోబెల్ శాంతి బహుమతి(nobel-peace-prize) ప్రకటనపై వైట్‌హౌస్(white-house) స్పందించింది. శాంతి స్థాపన కంటే..రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు గుప్పించింది. మరోసారి నోబెల్ కమిటీ(Nobel Committee) శాంతిపై రాజకీయాలను ఉంచుతుందని నిరూపించిందని వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. శాంతి ఒప్పందాలు చేసుకోవడం..యుద్ధాలను నిలినివేయడంలో ట్రంప్ ముందుంటారని వైట్‌హౌస్ వెల్లడించింది. ట్రంప్‌కు మానవతా హృదయం ఉందని వెల్లడించింది.
There will be a lot of PEACE in the USA and in the world, if you guys can vacate the Oval Office and White House immediately!
— Com_Sense (@GK_ponders) October 10, 2025
రష్యా మద్దతు ఇచ్చినప్పటికీ
కాగా 8 యుద్ధాలు ఆపానంటూ గొప్పలు చెప్పుకున్న ట్రంప్.. నోబెల్ కోసం వివిధ దేశాలతో నామినేట్ చేయించుకున్నారు. చివరి నిమిషంలో రష్యా మద్దతు ఇచ్చినప్పటికీ ట్రంప్ కు నోబెల్ దక్కలేదు. 2025 సంవత్సరానికి గానూ వెనిజులా మాజీ పార్లమెంట్ సభ్యురాలు మరియాకు నోబెల్ బహుమతి దక్కింది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు మరియా. ఆమె ప్రతిపక్షంలో ఐక్యత కోసం కృషి చేసిన ఒక ముఖ్య నాయకురాలిగా, నియంతృత్వంలో స్వేచ్ఛ కోసం ధైర్యంగా పోరాడిన వ్యక్తిగా నార్వేజియన్ నోబెల్ కమిటీ పేర్కొంది.
మారియా కొరీనా మచాడో వయస్సు 57 .. వెనిజులాలో పుట్టారు. ఆండ్రెస్ బెల్లో కాథలిక్ యూనివర్శిటీ నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, ఇన్స్టిట్యూటో డి ఎస్టూడియోస్ సుపీరియోరెస్ డి అడ్మినిస్ట్రేషన్ (IESA) నుండి ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2011 జనవరి 5 నుండి 2014 మార్చి 21 వరకు నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా పనిచేశారు.ఆమెపై 15 సంవత్సరాల పాటు పదవిని చేపట్టకుండా 2023 జూన్ 30న నిషేధం విధించబడింది.
వెనెజులాలో నిరంకుశత్వ, నికోలస్ మదురో పాలన పెరుగుతున్నప్పటికీ, ఆమె ప్రజాస్వామ్యం కోసం.. మానవ హక్కుల కోసం అవిరామంగా పోరాడారు. దేశంలో పౌరుల ప్రజాస్వామ్య హక్కులు తీవ్రంగా ఉల్లంఘనకు గురవుతున్న సమయంలో, ఆమె వాటిని పరిరక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఒకప్పుడు విచ్ఛిన్నమై ఉన్న ప్రతిపక్ష దళాలను ఏకం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు, స్వేచ్ఛాయుత ఎన్నికల డిమాండ్‌పై అందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చారు. 2023లో జరిగిన ప్రతిపక్ష ప్రైమరీ ఎన్నికలలో అనర్హత వేటు పడినప్పటికీ, ఆమె దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియ కోసం గట్టిగా నిలబడ్డారు.
బెదిరింపులు, అరెస్టులు, ప్రాణహాని ఉన్నప్పటికీ, ఆమె వెనెజులాలోనే ఉంటూ తన పోరాటాన్ని కొనసాగించారు. ఇది దేశంలోని లక్షలాది మంది ప్రజలకు ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది.ఆమె వెనెజులా సమాజం సైనికీకరణ కాకుండా, ప్రజాస్వామ్య మార్గాల ద్వారా శాంతియుత పరిష్కారం కోసం నిలబడ్డారు.
Also Read : Crime News : వీడు కోచ్ కాదు...కామాంధుడు..వాలీబాల్ కోచ్ వేధింపులు..విద్యార్థిని ఆత్మహత్య