/rtv/media/media_files/2025/07/05/gopal-khemka-2025-07-05-10-42-53.jpg)
Gopal Khemka
Gopal Khemka : ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు గోపాల్ ఖెమ్కా దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11.40 సమయంలో బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్ సమీపంలోని తన నివాసం వద్ద ఈ దారుణ ఘటన జరిగింది. ఇంటి పక్కనే ఉన్న ఓ హోటల్ ముందు దుండగులు ఆయనను కాల్చి చంపారు. ఆయన కారులో నుంచి దిగుతుండగా, బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన గోపాల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరికొన్ని నెలల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఖేమ్కా హత్య రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
VIDEO | Patna, Bihar: Businessman Gopal Khemka shot dead near his house. Visuals from his residence. Police investigation on.#BiharNews#PatnaNews
— Press Trust of India (@PTI_News) July 5, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ZkHIzWJbnE
Also Read: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !
గోపాల్ ఖెమ్కా రాష్ట్రంలోని అతి పురాతన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటైన మగధ దవాఖానకు యాజమాన్య బాధ్యతలు నిర్వర్తిస్తూ, బంకీపూర్ క్లబ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఆయన తన అపార్ట్‌మెంట్‌కు పక్కనే ఉన్న ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగివస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఖేమ్కా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఘటనాస్థలంలో ఒక బుల్లెట్, సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను గమనిస్తున్నామని చెప్పారు. కాగా.. గోపాల్ ఖేమ్కా కుమారుడు గుంజన్ కూడా 2018లో ఇలాగే హత్యకు గురయ్యారు.2018లో గుంజన్ వైశాలి ప్రాంతంలోని తన ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుండగా.. బైక్‌పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు.
ఇది కూడా చూడండి:Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు
గోపాల్ హత్య రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని లేపింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది‘ప్రముఖ వ్యాపారవేత్త తన ఇంటి సమీపంలోనే హత్యకు గురయ్యారు. రాష్ట్ర రాజధానిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు’’ అని నీతీశ్ కుమార్ సర్కారుపై కాంగ్రెస్ విరుచుకుపడింది. జేడీయూ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ హత్య జరిగిందని స్వతంత్ర ఎంపీ పప్పుయాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేదని, ప్రజాప్రతినిథులతో పాటు ప్రజలెవరూ సురక్షితంగా లేరని దుయ్యబట్టారు. ఖేమ్కా కుమారుడు హత్యకు గురైనప్పుడే ప్రభుత్వం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని ఉండుంటే గోపాల్ ఖేమ్కా ఈరోజు హత్యకు గురయ్యేవాడు కాదని పప్పు యాదవ్ అన్నారు.
ఇది కూడా చూడండి:Missing girl : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్ వైపు వెళ్లి.....