UP: యూపీలో ఊపందుకున్న కుల రాజకీయాలు ..హోటల్ లో 40 మంది ఠాకూర్ ఎమ్మెల్యేల సమావేశం..
ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ లో ఏదో జరుగుతోంది. వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా ఓ హోటల్ లో ఠాకూర్ వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు సమావేశం అవడం అనుమానాలకు తావిస్తోంది. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇరువురు నేతలూ ఉండడం గమనార్హం.