/rtv/media/media_files/2025/08/10/pm-modi-flags-off-three-new-vande-bharat-express-trains-from-bengaluru-2025-08-10-15-26-29.jpg)
PM Modi flags off three new Vande Bharat Express trains from Bengaluru, Know Details
కర్ణాటకలో ప్రధాని మోదీ మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఆదివారం ప్రత్యేక విమానంలో ఆయన HAL విమానాశ్రయానికి వచ్చారు. అనంతరం రోడ్డు మార్గంలో మెజిస్టిక్‌లోని సంగొళ్లి రాయణ్ణ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ బెంగళూరు-బెళగావి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. అలాగే అమృత్‌సర్-శ్రీమాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్, నాగపూర్-పూణె మధ్య వందే భారత్ రైలు సేవలు కూడా అక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆర్‌వీ రోడ్డు రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ మెట్రో ఎల్లో మార్గం ప్రారంభించారు. ఆ మెట్రో రైలులోనే ఎలక్ట్రానిక్ సిటీ వరకు ప్రయాణించారు.
ప్రధాని మోదీతో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ప్రయాణించారు. ఆ రైలులో విద్యార్థులు, సిబ్బందితో ప్రధాని ముచ్చటించారు. దీనికి సంబంధిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ సిటీలో ఐఐఐటీ సభా మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. అక్కడ మెట్రో 3వ దశకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆయన ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం ప్రదర్శించిన తీరును ప్రశంసించారు. అలాగే త్వరలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా మారనుందని పేర్కొన్నారు.
Also Read: ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ తో భారత సైన్యం చెస్ ఆడింది..ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
#WATCH | Bengaluru | Prime Minister Narendra Modi, along with Karnataka CM Siddaramaiah, Dy CM DK Shivakumar, and Union Minister Manohar Lal Khattar, undertakes a metro ride from RV Road (Ragigudda) to Electronic City metro station via the Yellow line that PM Modi inaugurated… pic.twitter.com/RxB1AcCPwC
— ANI (@ANI) August 10, 2025
అయితే ప్రధాని మోదీ బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్రారంభించడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. తాను ఎంతో కృషి చేసి రూపొందించిన అర్బన్ మొబిలిటీ ప్రాజెక్టుకు బీజేపీ క్రెడిట్ తీసుకుంటోందని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ధ్వజమెత్తారు. కేంద్రం నిధులు తగినంత ఇవ్వకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఆలస్యమైందని విమర్శించారు. ఇప్పటివరకు ఓట్ల చోరీ చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. మళ్లీ ఇప్పుడు తాము అభివృద్ధి చేసిన వాటిని చోరీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: విమానంలో ప్రయాణికురాలికి 'డర్టీ' సీటు.. ఇండిగో సంస్థకు భారీ జరిమానా
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో భారీగా ఖర్చు చేసి ఈ మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపును తగ్గించిందని దుయ్యబట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడిందని.. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చివరికి అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.