/rtv/media/media_files/2025/06/16/COmVH1PrlsJhKQb9TLaP.jpg)
railway
దేశంలో ఎక్కువ శాతం మంది రైల్వే ప్రయాణాలు చేస్తుంటారు. ఈ ప్రయాణాలు సురక్షితంగా ఉంటారని, అలాగే దూర ప్రాంతాలకు కూడా తొందరగా వెళ్లవచ్చని భావిస్తారు. అయితే ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఇండియన్ రైల్వే రౌండ్ ట్రిప్ ప్యాకేజీ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రిటర్న్ టికెట్ బేస్ ఫేర్‌పై దాదాపుగా 20 శాతం రాయితీ లభిస్తుంది. సాధారణ సమయాల్లో కంటే దీపావళి వంటి ఫెస్టివల్ సమయాల్లో ప్రయాణాలు చేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పథకం ఆగస్టు 14వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఈ పథకం వర్తించాలంటే కేవలం ఒక వైపు మాత్రమే రాకుండా రెండు వైపుల టికెట్లను కూడా బుక్ చేసుకోవాలి.
ఇది కూడా చూడండి: Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వానలే వానలు
Good News For Passengers!!📢
— Debjeet Ghosh (@DebjeetGho64778) August 9, 2025
Railway launches 20 percent rebate in return journey fare for a round trip package ahead of Diwali & Chhath festivals to spread out crowd.
Good news for people who wish to avail 5 week break from work during Diwali & Chhath vacations. @RailMinIndiapic.twitter.com/7ZtxpRfF6A
టికెట్లు కన్ఫర్మ్ అయితే రాయితీ..
ఈ రౌండ్ ట్రిప్ పథకం కింద ప్రయాణికులు ఫస్ట్ జర్నీ టికెట్‌ను బుక్ చేసుకోవాలి. అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 26 మధ్య టికెట్ బుక్ చేసుకున్న తర్వాత రిటర్న్ జర్నీ టికెట్‌ను నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1లోగా చేసుకోవాలి. వీటిని కనెక్టింగ్ జర్నీ ఫీచర్ ద్వారా ఈ టికెట్‌ను బుక్ చేసుకోవాలి. ఎవరి టికెట్లు అయితే కన్ఫర్మ్ అవుతాయో వారికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ నిబంధనలు రిటర్న్ జర్నీకి వర్తించవు. అలాగే వెళ్లే జర్నీ, రిటర్న్ జర్నీ టికెట్లు కూడా ఒకే తరగతికి బుక్ చేయాలి. అయితే ఈ పథకం అన్ని తరగతుల రైళ్లకు కూడా వర్తిస్తుంది.
ఇది కూడా చూడండి: Tollywood workers Strike: చర్చలు విఫలం..రేపటి నుంచి అన్ని షూటింగ్స్ బంద్
స్పెషల్ రైళ్లతో పాటు అందరికీ కూడా వర్తిస్తుంది. కాకపోతే రాజధాని, శతాబ్ది, దురంటో వంటి రైళ్లకు వర్తించదు. అలాగే వెళ్లే ప్రయాణం, వచ్చే ప్రయాణం టికెట్లు ఒకే మోడ్ ద్వారా బుక్ చేయాలి. వీటిపై ఎలాంటి రిఫండ్, మార్పిడి, ఎక్స్‌ట్రా రాయితీలు లభించవు. రైల్వే ట్రావెల్ కూపన్లు, వోచర్లు, పాస్‌లు లేదా PTOలు కూడా ఈ ఆఫర్‌కు వర్తించవు. ఈ రౌండ్ ట్రిప్ పథకం ముఖ్య ఉద్దేశం రైళ్లలో రద్దీని తగ్గించడానికి తీసుకొచ్చారు. పెద్ద పండుగ సమయాల్లో ఈజీగా తక్కువ ఖర్చుతో వెళ్లి రావడానికి ఈ పథకం తీసుకురానున్నారు. ప్రయాణికులు ఈ డిస్కౌంట్ పొందాలంటే తప్పకుండా బుకింగ్స్ ఆగస్టు 14 నుంచే ప్రారంభించాలి. IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా చేయవచ్చు. లేదా రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.