Army Chief Upendra Dwivedi: ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ తో భారత సైన్యం చెస్ ఆడింది..ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది

పాక్ యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని భారతీయ వాయుసేన నేలకూల్చిందని భారత ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది మరోసారి కన్ఫార్మ్ చేశారు.  ఆపరేషన్ సింధూర్ లో మన సైన్యం పాక్ తో చెస్ ఆడిందని అన్నారు. 

New Update
upendra dwivedi

Chief of the Army Staff (COAS) General Upendra Dwivedi

పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఈ సమయంలో పాకిస్తాన్ మన సేనలను అడ్డుకునేందుకు ఎదురుదాడి చేసింది. ఈ క్రమంలో భారతీయ వాయుసేన పాకిస్తాన్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని నేలకూల్చిందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రకటించారు. దీనిపై పాక్ కూడా స్పందించింది. అలాంటివేమీ జరగలేదని బుకాయించింది. అయితే దీనిపై భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ కూడా స్పందించారు. ఐఐటీ మద్రాస్ లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో మన సైన్యం దాయాదితో చెస్ ఆడిందని చెప్పుకొచ్చారు. వారి సైన్యం కదలికలు ఏంటో కూడా మాకు తెలియదు. దాన్నే గ్రే జోన్ అంటారు. లాంటి పరిస్థితుల్లో కూడా తాము ధైర్యంగా పోరాటం చేశామని ద్వివేదీ తెలిపారు. ఎన్ని ఎదురుదాడులు చేసినా పాకిస్తాన్ చెక్ పెట్టామని తెలిపారు. 

పక్కా ప్రణాళికలతో లక్ష్యాలు..

ఆపరేషన్ సిందూర్‌ను మేము పక్క ప్రణాళికతో నిర్వహించాం. కేవలం 80 నుంచి 90 గంటల్లోనే మా లక్ష్యాలను సాధించాం. ఇరుదేశాల మధ్య యుద్ధం ఇలాగే కొనసాగితే పాకిస్థాన్‌కు భారీ మూల్యం తప్పదని వాళ్లకి అర్థమయ్యింది. ఇక చేసేదేమి లేక వాళ్లు కాళ్ల బేరానికి వచ్చారు. భారత్‌తో చర్చలు జరుపుతామంటూ సందేశాలిచ్చారు. మేము దానికి అంగీకరించాం. సిందూర్ సమయంలో పాక్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేశాం. 

ఇంకో పెద్ద విమానాన్ని కూడా ధ్వంసం చేశాం. భారత సైన్యం దాడి చేసిన పాకిస్థాన్ ప్రధాన ఎయిర్‌ఫీల్డ్‌లలో షహబాజ్ జకోబాబాద్ స్థావం కూడా ఉంది. అక్కడే ఎఫ్‌ 16 హ్యాంగర్‌ ఉండగా మన బలగాలు దానిపై దాడి చేశాయి. ఆ తీవ్రతకు ఎఫ్‌ 16 సగానికి పైగా దెబ్బతింది. అక్కడ మరికొన్ని యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. అవి కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు మేము అంచనాకు వచ్చాం. పాక్‌పై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ సమయంలో మన ఎయిర్‌ఫోర్స్‌, ఎస్‌ 400 క్షిపణి వ్యవస్థ ఎంతో సమర్థవంతంగా పనిచేశాయని''  ఏపీ సింగ్‌ వివరించారు. 

Also Read: Film Fare Glamour and Style Awards: గ్రాండ్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్...తరలి వచ్చిన తారాగణం

Advertisment
తాజా కథనాలు