/rtv/media/media_files/2025/08/10/indigo-flight-2025-08-10-14-37-24.jpg)
IndiGo Fined 1.5 Lakh rupees For Providing Dirty Seat To Passenger
IndiGo Flight:
సుదూర ప్రయాణాలుకు చాలామంది విమానాల్లోనే వెళ్తారు. ఈమధ్య కాలంలో విమానాల్లో కూడా గొడవలు జరగడం, ప్రయాణికులపై అసభ్యంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల ఇండిగో విమానంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికురాలిని పరిశుభ్రంగా లేని, అసౌకర్యవంతమైన సీటులో కూర్చోబెట్టారు. ఇలా చేసినందుకు ఆ ఎయిర్‌లైన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ వినియోగదారుల ఫోరం రూ.1.5 లక్షల జరిమానా విధించింది. ఈ సొమ్ము మొత్తాన్ని ఆ ప్రయాణికురాలికి చెల్లించాలని ఆదేశించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది జనవరి 5న పింకీ అనే మహిళ బాకు-న్యూఢిల్లీ ఇండిగో విమానంలో ఎక్కింది. అయితే ఆమెకు అపరిశుభ్రంగా ఉన్న సీటు ఇచ్చారు. అది అసౌకర్యకంగా కూడా ఉంది. ఆమె ఇబ్బందులు పడుతూనే గమ్యస్థానం వచ్చేవరకు అందులోనే కూర్చున్నారు. ఆ తర్వాత ఢిల్లీలోని వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఆ సీట్లో కూర్చోవడం వల్ల తాను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడ్డానని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుపై కమిషన్ విచారణ జరిపింది.
Also Read: ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ తో భారత సైన్యం చెస్ ఆడింది..ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
ఆమె ఎదుర్కొన్న మానసిక ఇబ్బంది, అసౌకర్యానికి గాను పరిహారం రూ.1.5 లక్షల పరిహారం చెల్లించాలని ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఆమె రూ.25 వేలు ఖర్చు పెట్టింది. ఈ డబ్బులు కూడా ఇండిగోనే చెల్లించాలని చెప్పింది. అయితే వినియోగదారుల ఫోరం ఆదేశాలను ఇండిగో తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రయాణికురాలికి కేటాయించిన సీటు సరిగ్గా లేదన్న మాట వాస్తవేనని చెప్పింది. ఆ తర్వాత ఆమె అభ్యర్థన మేరకు వేరే సీటు కేటాయించినట్లు పేర్కొంది. దీంతో ఆమె అసౌకర్యవంతంగా ప్రయాణం చేసినట్లు చెప్పింది. అయితే వినియోగదారుల ప్రయాణ సమాచారాన్ని అందించే సిట్యువేషన్ డేటా డిస్‌ప్లే రిపోర్టును సమర్పించడంలో ఎయిర్‌లైన్స్ ఫెయిల్ అవ్వడంతో జరిమానా విధించాల్సిందేనని ఫోరం తేల్చిచెప్పింది.
Also Read: అన్నాచెల్లెలు కలిసి నగ్న స్నానం.. చూసి షాకైన భార్య.. చివరకు ఏమైందంటే?
IndiGo Fined Rs 1.5 Lakh For Providing "Unhygienic, Dirty" Seat To Passenger https://t.co/14ZecPYH5rpic.twitter.com/A2UUM840vd
— NDTV (@ndtv) August 10, 2025
ఇదిలాఉండగా ఇటీవల గుజారాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్‌ఇండియా విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 260 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత వరుసగా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. అలాగే ఇండిగో, స్పైస్ జెట్ లాంటి విమానాల్లో కూడా టెక్నికల్ సమస్యలు వచ్చాయి. దీనివల్ల ఆయా విమానాలను వెనక్కి మళ్లీంచడం, అత్యవసర ల్యాండింగ్ చేయించడం లాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం చాలామంది విమాన ప్రయాణాలు అంటే కూడా భయపడుతున్నారు. విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తకుండా విమానాయన సంస్థలు కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.