/rtv/media/media_files/2025/04/12/l5Uyavcu3swkD5Bv1q8x.jpg)
Pakistan Earthquake of 5.8 magnitude hits
ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. భూమి గజగజ వణుకుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా.. దేశంలోని పలు రాష్ట్రాల్లో సైతం భూమి కంపించింది. తాజాగా దాయాదు దేశం పాకిస్తాన్‌లో భూమి వణికింది. దాదాపు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. జమ్మూ-కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి అని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
EQ of M: 5.3, On: 12/04/2025 13:00:55 IST, Lat: 33.70 N, Long: 72.43 E, Depth: 10 Km, Location: Pakistan.
— National Center for Seismology (@NCS_Earthquake) April 12, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/8NMoU2Lhe2
Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!
రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ సమీపంలో శనివారం మధ్యాహ్నం 1:00 గంటలకు (IST) రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉండటంతో.. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది. పాకిస్తాన్‌లో 33.63 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 72.46 డిగ్రీల తూర్పు రేఖాంశంలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని వెల్లడించింది. అదే సమయంలో జమ్మూ, షోపియన్, శ్రీ నగర్‌తో సహా భారతదేశంలోని జమ్మూ, కాశ్మీర్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
పాకిస్తాన్ మీడియా ప్రకారం.. పాకిస్తాన్‌లోని కరక్, చినియోట్, మియాన్వాలి, హఫీజాబాద్, షేఖుపురా, గుజ్రాన్‌వాలా, సాంగ్లా హిల్, సఫ్దరాబాద్, పిండి బాటియన్, అటాక్‌లలో ప్రకంపనలు సంభవించాయని తెలిపాయి. ప్రకంపనల తరువాత ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారని అక్కడి మీడియా తెలిపింది. ఇకపోతే పాకిస్తాన్‌లో తరచుగా వివిధ తీవ్రతలతో కూడిన భూకంపాలు సంభవిస్తుంటాయి. 2005లో ఆ దేశంలో అత్యంత దారుణమైన భూకంపం సంభవించింది. ఆ ప్రకంపానికి దాదాపు 74,000 మందికి పైగా మరణించారు.
Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!
Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్
telugu-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | breaking news in telugu