Earthquake: రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ఆదివారం ఒక్కరోజే భారత్, ఇరాన్, తజికిస్తాన్లో భూకంపాలు వచ్చాయి. తాజాగా రష్యాలో కూడా భారీ భూకంపం సంభవించింది. 7.4 తీవ్రతతో రష్యా తీరంలో ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఆదివారం ఒక్కరోజే భారత్, ఇరాన్, తజికిస్తాన్లో భూకంపాలు వచ్చాయి. తాజాగా రష్యాలో కూడా భారీ భూకంపం సంభవించింది. 7.4 తీవ్రతతో రష్యా తీరంలో ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇవాళ మూడు దేశాల్లో భూకంపాలు సంభవించాయి. భారతదేశంతో పాటు ఇరాన్, తజికిస్తాన్లో కూడా భూకంపాలు ప్రజలను వణికించాయి. ఈ మూడు దేశాలలో భూకంప తీవ్రత 2 నుండి 6 వరకు ఉంది. దీని కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా వెల్లడికాలేదు.
ఉత్తరాఖండ్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్‌లలో ఒకేసారి భూకంపాలు సంభవించాయి. భారత్‌లోని ఉత్తరాఖండ్ చమోలిలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) సమాచారం ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
అమెరికాలోని అలాస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
ఫిలిప్పీన్స్‌లోని లూజోన్ ద్వీపంలో మంగళవారం తెల్లవారుజామున 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని మనీలాలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
ఇండోనేషియాలో ఇవాళ 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. తనింబర్ దీవుల ప్రాంతంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదించబడలేదు.
దేశ రాజధానిలో మరోసారి భూకంపం సంభవించింది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) అంతటా ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం సాయంత్రం భూప్రకంపనలు రావడంతో జనాలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.