ASI: తెలంగాణలో 800 ఏళ్ల క్రితం నాటి పురాతన వస్తువులు గుర్తింపు.. ఏంటంటే ?

సూర్యాపేట జిల్లాలోని కొదాడలో ఓ ముస్లిం స్మశానవాటిలో 800 ఏళ్ల క్రితం నాటి రాగి పలకలను పురావస్తు శాస్త్రవవేతలు గుర్తించారు. ఈ కాపర్ ప్లేట్లు వేంగి చాళుక్యులు పాలించిన కాలానికి చెందినట్లుగా పేర్కొన్నారు.

New Update
ASI begins chemical treatment of 800-year-old Chalukya-era copper plates found in Suryapet

ASI begins chemical treatment of 800-year-old Chalukya-era copper plates found in Suryapet Photograph: (ASI begins chemical treatment of 800-year-old Chalukya-era copper plates found in Suryapet)

సూర్యాపేట జిల్లాలోని  కొదాడలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఓ ముస్లిం స్మశానవాటిలో 800 ఏళ్ల క్రితం నాటి కాపర్‌ ప్లేట్లను పురావస్తు శాస్త్రవవేతలు గుర్తించారు. మొత్తం 9 సెట్ల కాపర్‌ ప్లేట్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. అయితే తాజాగా వాటిని కెమికల్ ట్రీట్‌మెంట్‌ చేయడం ప్రారంభించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) డైరెక్టర్ మునిరత్నం రెడ్డి దీనిగురించి మాట్లాడారు. 

Also Read: త్రిశూల శక్తితో ఇండియన్ నేవీ బీభత్సం.. INS యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాప్టర్

800 Year Old Chalukya Era Copper Plates

ఈ కాపర్ ప్లేట్లు వేంగి చాళుక్యులు పాలించిన కాలానికి చెందినట్లుగా తమ ప్రాథమిక పరిశీలనలో తేలిందని తెలిపారు. ఈ రాగి పలకలు శతాబ్దాలుగా మట్టిలోనే కూరుకపోయాయని.. ఏప్రిల్ 30న తవ్వకాల్లో బయడపడ్డాయని పేర్కొన్నారు.  వీటిని కోదాడ నుంచి రాష్ట్ర పురావస్తు విభాగానికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు ఈ రాగి పలకలకు కెమికల్ ట్రీట్‌మెంట్‌ చేయడం ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. 

Also Read: మోదీజీ సూసైడ్ బాంబు ఇవ్వండి.. పాకిస్తాన్ వెళ్లి అందరినీ చంపుతా : ముస్లిం మంత్రి

ఆ రాగిపలకలకు రసాయనిక పరీక్ష చేయడం ద్వారా వేంగి చాళుక్య కాలంలో ఉన్న చారిత్రాత్మక జ్ఞానసంపదను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే వేంగి చాళుక్య రాజవంశస్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాలను 7వ శతాబ్ధం నుంచి 12వ శతాబ్ధం వరకు పాలించినట్లు పేర్కొన్నారు. 

Also Read: గ్యాప్ లేకుండా దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్కు మరో షాకిచ్చిన మోదీ!

Also Read: నేతలకూ తప్పని టార్చర్..బీజేపీ మహిళా మంత్రికి అసభ్యకరమైన కాల్స్, మెసేజెస్

archaeologists | rtv-news | telugu-news | latest telangana news | today-news-in-telugu | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు