/rtv/media/media_files/2025/12/14/nitin-nabin-appointed-as-bjp-national-working-president-2025-12-14-17-46-40.jpg)
Nitin Nabin appointed as BJP national working president
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్‌కు హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన బిహార్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నితిన్ నబీన్‌ను ఎంపిక చేసింది. పార్టీలో సీనియర్ నాయకుడైన నితిన్.. ఏకంగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకున్న క్రమశిక్షణ, మేనేజ్‌మెంట్ స్కిల్స్, నాయకత్వం లాంటి లక్షణాల ఆధారంగా పార్టీ ఆయనకు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టింది.
Also Read: కమ్యూనిస్టుల కంచు కోట బద్దలు.. కేరళ లోకల్ ఎలక్షన్స్ లో దుమ్ములేపిన BJP
Nitin Nabin Appointed As BJP National Working President
జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది బీజేపీ అత్యంత కీలకమైన పదవి. జాతీయ అధ్యక్షుడికి సహకరించడం, దేశవ్యాప్తంగా జరిగే పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షించడం, అలాగే ఎన్నికలు జరిగినప్పుడు వ్యూహాలు అమలు చేయడం లాంటి బాధ్యతలు వర్కింగ్ ప్రెసెడెంట్ తీసుకుంటారు. అయితే బీహార్ నుంచి జాతీయ స్థాయిలో ఇంతపెద్ద పదవి రావడం అనేది చాలా అరుదు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నియామకం జరిగినట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: ఢిల్లీని ఆక్రమిస్తాం.. పాక్ ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు
నితిన్ నబిన్‌కు బీహార్‌లో బలమైన సపోర్టు ఉంది. ఆయకున్న అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని పార్టీ అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఆయకు ఈ కీలకమైన బాధ్యతను అప్పగించింది. రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగైన నేతగా నితిన్ గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే పార్టీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరికొన్నిరోజుల్లోనే ఈ పదవి బాధ్యతలు కూడా హైకమాండ్ అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: మచాదో కోసం అమెరికా రహస్య ఆపరేషన్..వేషం మార్చి నార్వేకు..
Follow Us