Thiruvananthapuram :  కమ్యూనిస్టుల కంచు కోట బద్దలు.. కేరళ లోకల్ ఎలక్షన్స్ లో దుమ్ములేపిన BJP

తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో NDA కూటమికి భారీ ఆధిక్యత లభించింది. మొత్తం 101 డివిజన్లలో NDAకు 50, LDF 29, UDF 19 డివిజన్లలో గెలిచింది. 45 ఏళ్లుగా లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్న తిరువనంతపురం కమ్యూనిస్టుల చేయి దాటినట్లయింది.

New Update
FotoJet (5)

NDA Win In Thiruvananthapuram

Thiruvananthapuram : తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో NDA కూటమికి భారీ ఆధిక్యత లభించింది. మొత్తం 101 డివిజన్లలో NDAకు 50, LDF 29, UDF 19 డివిజన్లలో గెలిచింది. 45 ఏళ్లుగా లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్న తిరువనంతపురం కమ్యూనిస్టుల చేయి దాటినట్లయింది. మరోవైపు చూస్తే, ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి వామపక్ష పార్టీలకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.  

కేరళలోని తిరువనంతపురం కార్పొరేషన్​లో ఎన్​డీఏ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేరళ రాజకీయాల్లో ఒక 'కీలక మలుపు' అని అభివర్ణించారు. ఈ అద్భుత విజయాన్ని సాధించినందుకు ఆయన కేరళ బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలే పార్టీకి బలం అని, వారందరి పట్ల తాను గర్వపడుతున్నానని అన్నారు.


 వాస్తవానికి కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ మంచి పనితీరు కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్​ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఎల్​డీఎఫ్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని అన్నారు.ఈ వారం ప్రారంభంలో కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. అయితే ప్రస్తుతమున్న ట్రెండ్​ ప్రకారం, ఎల్​డీఎఫ్​ కంటే యూడీఎఫ్​ ఎక్కువ గ్రామ పంచాయితీలు, బ్లాక్​ పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్​లలో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అధికార ఎల్​డీఎఫ్​పై విమర్శలు గుప్పించారు. అయ్యప్ప ఆలయంలోని బంగారు తాపడాలకు నష్టం కలగడానికి కారణమైన వారిని ప్రజలు తిరస్కరించడం ప్రారంభించారని, ఈ ఎన్నికల ఫలితాలు దానికి నిదర్శనమని అన్నారు. సీపీఐ(ఎం), ఎఫ్​డీఎఫ్​ల కంచుకోటలో కూడా యూడీఎఫ్ విజయాలు సాధించిందని ఆయన అన్నారు. అయితే అయ్యప్ప స్వామి బంగారం కేసులో బీజేపీ నీచమైన ఆట ఆడిందని వారు ఆరోపించారు. సీపీఐ(ఎం) బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలు కేవలం తాత్కాలికమైనవని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాత్రమే కాంగ్రెస్​కు లభించాయని బీజేపీ నేత చంద్రశేఖర్​ వివరించారు. ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నేతలకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ శుభాకాంక్షలు తెలిపారు. కాగా తిరువనంతపురం మేయర్‌గా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీలేఖ ఎంపికయ్యారు.

Advertisment
తాజా కథనాలు