/rtv/media/media_files/2025/07/27/operation-sindoor-2025-07-27-13-26-49.jpg)
Operation Sindoor
పహల్గాం ఉగ్రదాడి ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 27 మంది పర్యాటకులు మృతి చెందారు. ఈ ఘటన తర్వాత ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. అయితే తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఆపరేషన్ సింధూర్ వివరాలను స్కూల్ పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ఆపరేషన్ సింధూర్‌ను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని ప్రకటించారు. అయితే తాజాగా దీనిపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT) స్పందించింది.
Also Read: సంచలన వీడియోలు.. మానస దేవి ఆలయంలో తొక్కిసలాట ఎలా జరిగిందో చూశారా?
విద్యార్థుల్లో దేశభక్తిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు NCERT పేర్కొంది. పిల్లలకు జాతీయ భద్రత, సైనిక వ్యూహం అలాగే దౌత్య ప్రాముఖ్యతను బోధించడమే తమ లక్ష్యమని తెలిపింది. దీనికోసం ప్రత్యేక మాడ్యూల్‌ను కూడా సిద్ధం చేసినట్లు చెప్పింది. అయితే ఈ మాడ్యూల్‌ను రెండు భాగాలుగా విభజిస్తారు. ఒకటి 3 నుంచి 8 తరగతులు విద్యార్థుల కోసం మరొకటి 9 నుంచి 12 తరగతులు విద్యార్థుల కోసం రూపొందించనున్నారు.
Also Read: ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల....ఆ తర్వాత ఏం జరిగిందంటే..
అంతేకాదు ఆదిత్య ఎల్1, చంద్రయాన్ అంతరిక్ష మిషన్‌ల అంశాలను కూడా కొత్త సిలబస్‌లో చేర్చనున్నట్లు NCERT అధికారులు తెలిపారు. ఇటీవల ఇస్రో వ్యోమగామి శుభాన్షు శుక్లా ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్ (ISS)కి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అంశాలను కూడా సిలబస్‌లో చేర్చనున్నట్లు పేర్కొన్నారు.
Also Read: వీర్యం డొనేట్ చేసి అంత సంపాదించొచ్చా !