Sperm: వీర్యం డొనేట్ చేసి అంత సంపాదించొచ్చా !

ఇటీవల అక్రమంగా IVF విధానాన్ని పాటిస్తున్న ఓ టెస్ట్‌ ట్యూబ్ బేబీ కేంద్రం (ఇండియన్ స్పర్మ్ టెక్) బాగోతం బయటపడ్డ సంగతి తెలిసిందే. వీర్యం డొనేట్‌ చేసే పురుషులకు 4 వేల రూపాయల వరకు ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్‌ చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

New Update
sperm

sperm

ఇటీవల అక్రమంగా IVF విధానాన్ని పాటిస్తున్న ఓ టెస్ట్‌ ట్యూబ్ బేబీ కేంద్రం (ఇండియన్ స్పర్మ్ టెక్) బాగోతం బయటపడ్డ సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లో ఉన్న ఈ కేంద్రంలో అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఇండియన్ స్పర్మ్ టెక్‌ మేనేజర్‌ పంకజ్‌ సోనీని చేర్చారు. ఈ కేసులో ఇప్పటిదాకా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.   

Also Read: ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల....ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Also Read :  తండ్రైన ‘ఛావా’ నటుడు.. మగబిడ్డకు స్వాగతం

Sperm Donation

అంతేకాదు ఇండియన్ స్పర్మ్‌ టెక్ నుంచి సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌కు గత కొంతకాలంగా సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అనధికారికంగా ఎలాంటి పర్మిషన్లు లేకుండానే ఇండియన్‌ స్పర్మ్ టెక్‌ కేంద్రాన్ని నడిపిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఇక్కడ సేకరించిన వీర్యాన్ని, అండాలను గుజరాత్‌, అహ్మదాబాద్‌, మధ్యప్రదేశ్‌లో ఉన్న IVF కేంద్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. వీర్యం డొనేట్‌ చేసే పురుషులకు 4 వేల రూపాయల వరకు ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్‌ చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది.  

Also Read: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పామునే కొరికి చంపేశాడు

ఇదిలాఉండగా సికింద్రబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో తండ్రి విర్యాన్ని కాకుండా మరోకరి వీర్యం ద్వారా సంతానం కలిగించిన ఘటన సంచలనం రేపుతోంది. దీన్ని నడిపిస్తున్న డాక్టర్‌ నమ్రతను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్‌ చేశారు.  పిల్లల కోసం సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ఓ మహిళ ఆశ్రయించారు. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని ఆమె కోరారు. కానీ, వేరే వారి వీర్యకణాలతో సంతానం కలిగించారు వైద్యురాలు. టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం వచ్చిన దంపతులకు మగ బిడ్డ జన్మించింది. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితమే పుట్టిన బాబుకి కేన్సర్ అని తేలడంతో దంపతులు షాకయ్యారు. అనుమానం వచ్చి డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించారు. శిశువు డీఎన్‌ఏ వేరే వారిదిగా తేలడంతో దంపతులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి డా. నమ్రతను అరెస్టు చేశారు. 

Also Read :  IVF బిడ్డను కనడానికి ముందు.. సరైన డైట్ పాటించడం ఎందుకు కీలకమో తెలుసా..?

telugu-news | rtv-news | sperm

Advertisment
తాజా కథనాలు