ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి బాబ్రీ మసీదు పేరు తొలగింపు
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో కీలక మార్పులు చేసింది. పన్నెండవ తరగతి పుస్తకం నుంచి బాబ్రీ మసీదు అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. అలాగే అయోధ్య అధ్యాయం నుంచి నాలుగు పేజీలను కూడా తగ్గించేసింది.