Haridwar Temple Stampede: సంచలన వీడియోలు.. మానస దేవి ఆలయంలో తొక్కిసలాట ఎలా జరిగిందో చూశారా?

హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయంలో ఇవాళ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. శ్రావణమాసం కావడంతో భక్తులు భారీగా తరలిరావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Haridwar Stampede

Haridwar Stampede

హరిద్వార్‌లోని మానస దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట తర్వాత మొదటి వీడియోలు బయటపడ్డాయి. ఒక వీడియోలో ఆలయం రద్దీగా ఉంది. ఆలయం భక్తులతో నిండిపోయి ఉండటం కనిపిస్తుంది. కాలు పెట్టడానికి కూడా స్థలం లేనింత జనసమూహం ఉంది. మరొక వీడియోలో.. గాయపడిన వారిని నేలపై పడుకోబెట్టినట్లు ఉంది. గాయపడిన వారిని బైక్‌లపై తీసుకెళ్తున్నట్లు చూడవచ్చు. మృతుల్లో ఒక చిన్నారి, ఒక వృద్ధుడు ఉన్నారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది మహిళలే కావడం గమనార్హం. 

Also Read :  తండ్రైన ‘ఛావా’ నటుడు.. మగబిడ్డకు స్వాగతం

ప్రమాదంపై విచారణ

గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ పాండే సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమంత్రి పుష్కర్ ధామి స్వయంగా ప్రమాదం గురించి తెలుసుకుని దర్యాప్తుకు ఆదేశించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో దేవాలయాలను సందర్శించకుండా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొండ రోడ్లు ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ప్రభుత్వం, పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

Also Read :  IVF బిడ్డను కనడానికి ముందు.. సరైన డైట్ పాటించడం ఎందుకు కీలకమో తెలుసా..?

ప్రత్యక్ష సాక్షి సంచలన వ్యాఖ్యలు

అకస్మాత్తుగా పెద్ద ఎత్తున జనం గుమిగూడి తొక్కిసలాట జరిగిందని గాయపడిన ఒక వ్యక్తి చెప్పారు. ఆ సమయంలో తాను కిందపడి పోయానని.. తన చేయి విరిగిందని తెలిపారు. మరో భక్తుడు మాట్లాడుతూ.. తాను ఈ ప్రమాదాన్ని తన కళ్ళతో చూశానని చెప్పాడు. ఆ సమయంలో తాను చాలా ఎత్తులో ఉన్నానని.. అందువల్లనే ఈ ప్రమాదం నుండి బయటపడ్డానని తెలిపారు. 

Also Read :  గండికోట మైనర్ హత్య కేసులో సంచలనం.. మర్డర్ వెనుక ఆ రాజకీయ నేత?

Also Read :  స్టాండింగ్ డెస్క్ ఉపయోగించడం ద్వారా డయాబెటిస్‌పై సహజ నియంత్రణ

Haridwar Stampede | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు