MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కేంద్రానికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తేనె తుట్టే పై రాళ్లు రువ్వొద్దని హెచ్చరించారు.డీఎంకే ఉనికిలో ఉన్నంత కాలం ఈ గడ్డ పై తమిళ భాష,ప్రజలకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలనూ అనుమతించనని అన్నారు.

New Update
Stalin

జాతీయ విద్యావిధానం అమలుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.తేనె తుట్టే పై రాళ్లు రువ్వొద్దని హెచ్చరించారు.డీఎంకే ఉనికిలో ఉన్నంత కాలం ఈ గడ్డ పై తమిళ భాష, రాష్ట్ర ప్రజలకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలనూ అనుమతించనని స్పష్టం చేశారు.

Also Read: Kamal Hasan: ఆలస్యంగా రావడం వల్లే ఓటమి..20 ఏళ్ల ముందే వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది!

బ్లాక్‌మెయిల్ చేయడం రాజకీయం కాదా?...

విద్యను రాజకీయం చేయోద్దంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలకు ఎంకే స్టాలిన్‌ ఇలా కౌంటర్‌ ఇచ్చారు.రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? మీరా? మేమా? త్రిభాషా విధానానికి ఆమోదిస్తేనే నిధులు విడుదల అవుతాయని బ్లాక్‌మెయిల్ చేయడం రాజకీయం కాదా? ఎన్‌ఈపీ పేరుతో హిందీని రుద్దడం రాజకీయం కాదా? ఒక పథకానికి ఉద్దేశించిన నిధులను మరో పథకానికి మళ్లించడం రాజకీయం కాదా? అని ఎంకే స్టాలిన్‌ వరుస ప్రశ్నలతో కేంద్రం పై మండిపడ్డారు.

Also Read: Mumbai: వార్ధా సామూహిక అత్యాచారం కేసులో..8 మంది నిర్దోషులుగా హైకోర్టు ప్రకటన

అసలు రాజకీయాలు ఎవరు చేస్తున్నారనే విషయాన్ని కేంద్రం ఆలోచించాలన్నారు.ప్రజల సంక్షేమం కోసం డీఎంకే ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుంటే...బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం మతపరమైన ఉద్రిక్తతల కోసం ఖర్చు చేస్తోందని స్టాలిన్‌ ఆరోపించారు.పీఎం శ్రీ స్కూల్‌ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల తమిళనాడు రూ.5000 కోట్లు నష్టపోతోందని కేంద్ర మమంత్రి ధర్మేంద్రప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ..మంత్రిగారూ...తమిళనాడు నుంచి వచ్చే పన్నులు మీకు ఇవ్వం అని చెప్పడానికి ఒక్క సెకను సమయం కూడా పట్టదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

సమాఖ్య స్ఫూర్తి అనేది ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంటుందనిఇ రాజ్యాంగం ప్రధాన లక్షణం కూడా ఇదేనని స్టాలిన్‌ పేర్కొన్నారు. దీన్ని అరర్థం  చేసుకోకుండా  పాలించచడం దేశానికి పెద్ద శాపమన్నారు.నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చింది విద్యను ప్రోత్సాహించేందుకు కాదని,కేవలంహిందీని వ్యాప్తి చేసేందుకేనని తమిళనాడు ముఖ్యమంత్రి మరోసారి ఆరోపించారు.

Also Read: Wedding: ఆ రైతులే ఆదర్శం.. పంట పొలాల్లో పెళ్లి చేసుకున్న జంట..

Also Read: Rome: మరణానికి మందే శవపేటిక, సమాధి రెండూ సిద్ధం...ఎవరికో తెలుసా..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు