/rtv/media/media_files/2025/02/21/SxdBypGgUHIDbsmTNUqn.jpg)
NRI Couple’s Unconventional Wedding In Punjab Fields
సాధారణంగా పెళ్లి అంటే ఫంక్షన్ హాల్, కలర్‌ఫుల్ డెకరేషన్, వివిధ రకాల వంటలు, డ్యాన్సులు వంటివి ఉంటాయి. కానీ విదేశాల్లో ఉంటున్న ఓ పంజాబ్ జంట మాత్రం దీనికి వినూత్నంగా ఆలోచించింది. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా పంట పొలాల్లో పెళ్లి వేడుక జరుపుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల చేసిన పొరటం వల్లే తాము ఇలా పెళ్లి చేసుకున్నట్లు నూతన వధూవరులు తెలిపారు.
Also Read: అమెరికా డిపోర్టేషన్.. మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదన్న కేంద్రం
ఇక వివరాల్లోకి వెళ్తే పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో కారీ కలాన్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోనే ఉన్న పంట పొలాల్లో దుర్లభ్ సింగ్, హర్మన్ కౌర్ జంట పెళ్లి జరిగింది. వీళ్లిద్దరూ కెనడాలోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. పెళ్లి చేసుకునేందుకు తమ స్వస్థలం వచ్చారు. పెళ్లి రోజున వధువు హర్మన్‌కౌర్‌ను భారీ ఊరేగింపుతో వరుడు దుర్లబ్ సింగ్ ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్కడినుంచి ఊరి బయట ఉన్న పొలాల్లో ఏర్పాటు చేసిన పెళ్లి మండపం పైకి వచ్చింది. అక్కడే బంధు, మిత్రుల సమక్షంలో వధూవరులు ఒక్కటయ్యారు. అలాగే రైతుల నినాదాలతో ముద్రించిన స్వీట్ బాక్సులను పంచారు. రైతులు ఉత్పత్తి చేసిన తేనె సీసాలను అందించారు.
Also Read: మరో మీర్ పేట మర్డర్.. 20 ఏళ్లుగా ఫ్రిజ్ లోనే పుర్రె, అస్థి పంజరం.. ఆ డెడ్ బాడీ ఎవరిది?
అయితే ఇలా పంట పొలాల్లో జంట పెళ్లి చేసుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళను ఆదర్శంగా తీసుకొనే తాము ఇలా పెళ్లి చేసుకున్నట్లు ఆ నూతన వధూవరులు చెప్పారు. దీంతో ఆ జంటను చాలామంది ప్రశంసిస్తున్నారు. రైతులను ఆదర్శంగా తీసుకుని ఇలా వినూత్నంగా వివాహ వేడుక జరుపుకోవడాన్ని అభినందిస్తున్నారు.
Also Read: పదవ తరగతి పరీక్షల్లో చీటింగ్ జరిగిందని తుపాకులతో కాల్పులు.. ఒకరు మృతి
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. స్పాట్‌లోనే 9మంది మృతి!