/rtv/media/media_files/2025/02/21/Tl8GdEYuNESwR7VMwXUs.jpg)
Pope Francis
పోస్ ఫ్రాన్సిస్...ఈయన ఎంత ముఖ్యమైన వ్యక్తో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈయన ఆరోగ్యం ఏమీ బాలేదు. 88 ఏళ్ళ పోప్ న్యుమోనియాతో బాధపడుతున్నారు. ప్రస్తుతం పోప్ ఫ్రాన్సిస్ పరిస్థితి ఏమీ బాలేదు. అందుకే ఆయన చనిపోతే ఏం చేయాలి అనేదానికి ప్రిపరేషన్స్ మొదలుపెట్టారు. అంత్రక్రయిలను రిహార్సల్స్ చేస్తున్నారు.
ఆయన తేరుకోవడం కష్టమే..
పోప్ ఫ్రాన్సిస్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఆయనను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ న్యూమోనియా నుంచి పోప్ బయటపడడం కష్టమే అని సమాచారం. అందుకే పోప్ ను రక్షించే స్విస్ గార్డులు ఆయన అంత్యక్రియలను రిహార్సల్స్ చేస్తున్నారు. యూరోప్ దేశాలన్నింటికీ పోప్ చాలా ముఖ్యమైన దేవుడు. ఇటలీ ఉండే ఈయనను సందర్శించుకోవడానికి వేలమంది తరలి వెళుతుంటారు. ఇంకా చెప్పాలంటే క్యాథలిక్ క్రైస్తవులకు పోప్ ప్రత్యక్ష దేవుడు. అలాంటి వారు చనిపోతే కూడా దానిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. చాలాదేశాలు రెండు, మూడు రోజుల పాటూ సంతాపదినాలు కూడా చేస్తాయి. అందుకే ఆయన అంత్యక్రియలకు ఇంత ప్రాక్టీస్ జరుగుతోంది. పోస్ స్థానంలో ఉన్న ఏ వ్యక్తికి అయినా ఈ గౌరవం ఉంటుంది. ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ చనిపోతే..తరువాతి స్థాసంలో ఉన్న వ్యక్తి కొత్త పోప్ అవుతారు.
ప్రస్తుతం ఇటలీలో పోప్ సందర్శన ఆపేశారు. ఆయన ఫ్యామిలీని కూడా బయటకు రానివ్వడంలేదు. అలాగే పోప్ ఫ్రాన్సిస్ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు. ఫ్రాన్సిస్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో ఆస్తమాటిక్ బ్రోన్కైటిస్ కూడా ఉందని, దీనికి కార్టిసోన్ యాంటీబయాటిక్ చికిత్స అవసరమని తెలిపింది రోమ్ లోని జెమెల్లీ ఆసుపత్రి వైద్య బృందం. ఈయన ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని చాలా ఏళ్ళ కిందట తొలగించారు. అందుకే ఇప్పుడు వచ్చిన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వల్ల పోప్ తేరుకోవడం కష్టమని చెబుతున్నారు. అయితే పోప్ ఫ్రాన్సిస్ చాలా ప్రశాంతంగా ఉన్నారని...ఆయన అన్నింటికీ సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. వారి నాయకత్వం ప్రభువు చేతుల్లో ఉందని చెబుతున్నారు.
Also Read: Cricket: ఒక్కొక్కరు ఒక్కోలా..టీమ్ ఇండియా ఆటపై సీనియర్లు