/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kamal-1-jpg.webp)
Kamal Haasan
తమ భాష కోసం ఎంతో మంది తమిళులు ప్రాణ త్యాగాలు చేసినట్లు ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ అన్నారు. భాషతో ఆటలాడుకోవద్దని హెచ్చరించారు. ఎంఎన్‌ఎం 8 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చెన్నైలోని పార్టీ హెడ్ క్వార్టర్స్ లో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి కమల్ హాసన్ మాట్లాడారు.తమిళ భాష ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
కమల్ మాట్లాడుతూ..భాష విషయంలో తమిళులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారన్నారు. భాషను రక్షించుకోవడంలో వారి పోరాటాన్ని ఉద్ఘాటించారు.హిందీ అమలుకు వ్యతిరేకంగా తమిళనాడు చేసిన చారిత్రక పోరాటాన్ని ప్రస్తావించారు.భాషా సమస్యలను తేలికగా తీసుకునేవారిని ఆయన హెచ్చరించారు. భాష కోసం తమిళులు ప్రాణాలు కోల్పోయారు. భాషతో ఆటలాడొద్దు. తమిళులతో పాటు వారి చిన్నారులకు సైతం తమ మాతృభాష ఎంత అవసరమో తెలుసు.వారికి ఏ భాష ఎంచుకోవాలో స్పష్టత ఉంది అని కమల్ పేర్కొన్నారు.
ముందే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే...
ఇక తన పొలిటికల్ కెరీర్ పై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చానని, అందుకే ఓడిపోయినట్లు భావిస్తున్నానని తెలిపారు.20 ఏళ్ల ముందే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఇప్పుడు తన ప్రసంగం స్థానం వేరేలా ఉండేవన్నారు.ఈ రోజు మన పార్టీ పెట్టి 8 సంవత్సరాలు .చిన్న పాపలా ఇప్పుడే ఎదుగుతోంది.
ఈ ఏడాది పార్లమెంట్ లో మన పార్టీ గొంతు వినిపించబోతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీలోనూ అది కచ్చితంగా తెలుస్తుందని కమల్ పేర్కొన్నారు.2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సన్నధ్దంగా ఉండాలని కార్యకర్తలకు కమల్ సూచించారు. ఇక కమల్ పార్లమెంట్ లో అడుగు పెట్టనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
డీఎంకే పార్టీ ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేయనుందంటూ ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కమల్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.కమల్ వ్యాఖ్యలు ఇటీవలి ప్రచారానికి బలం చేకూర్చినట్లు అవుతోంది.