MH: అవినీతిని ప్రశ్నించాడని సర్పంచ్‌ను చంపించిన మంత్రి.. అతను అరెస్ట్!

మహారాష్ట్ర మస్జోగ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ హత్య కేసు ప్రధాన సూత్రధారి వాల్మిక్ కరాద్ లొంగిపోయాడు. మంత్రి ధనంజయ్ ముండే అనుచరుడైన వాల్మిక్.. రాజకీయ కక్షతోనే తనను ఇందులోకి లాగుతున్నారని, నకిలీ కేసులో లొంగిపోతున్నా అంటూ అరెస్టుకు ముందు వీడియో రిలీజ్ చేశాడు.

New Update
kadapa murder

Maharastra Sarpanch Santosh murder case Valmik Karad arrested

Beed Sarpanch Murder Case In Maharastra(MH): మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మస్జోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు వాల్మిక్ కరాద్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మంగళవారం ఉదయం కరద్ తన సహచరులతో కలిసి కారులో పూణెలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) కార్యాలయంకు వచ్చి స్వయంగా లొంగిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వాల్మిక్ కరాద్ మహారాష్ట్ర(MH) మంత్రి ధనంజయ్ ముండేకు అత్యంత సన్నిహితుడు కావడం ఈ కేసులో సంచలనం రేపుతోంది. ఈ హత్యలో ఎవరెవరి హస్తం ఉంది? అనే కోణంలో పూణె పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. 

Also Read: USA: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా

రాజకీయ పగతో హత్య కేసులోకి..

అయితే వాల్మిక్ లొంగిపోయే ముందు.. తనను కావాలనే రాజకీయ పగతో హత్య కేసులోకి లాగుతున్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీంతో వీడియోను పరిశీలించిన పోలీసులు.. మస్జోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ను డిసెంబర్ 9న కిడ్నాప్ చేసి, ఆపై దారుణంగా హత్య చేశారని చెప్పారు. ఎందుకంటే బీడ్ జిల్లాలోని ఓ విండ్‌మిల్ కంపెనీ నుంచి డబ్బు డిమాండ్ చేస్తూ కొంతమంది చేసిన దోపిడీ ప్రయత్నాన్ని ఆయన వ్యతిరేకించారని వెల్లడించారు. ఇప్పటికే సర్పంచ్ హత్యకేసులో నలుగురిని అరెస్టు చేయగా వాల్మిక్ కరాద్ సంబంధిత దోపిడీ కేసులో వాంటెడ్ నిందితుడిగా ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు

నకిలీ కేసులో లొంగిపోతున్నా

వాల్మిక్ కరాద్ వీడియోలో ఏముందంటే..'బీడ్ జిల్లాలోని కేజ్ తాలూకాలో నాపై నమోదైన నకిలీ కేసులో పూణేలోని సిఐడి అధికారుల ముందు లొంగిపోతున్నా. సంతోష్ దేశ్‌ముఖ్ (హత్య) కేసులో ప్రమేయమున్న వ్యక్తులకు ఉరిశిక్ష విధించాలి. రాజకీయ పగతోనే ఈ కేసులో నన్ను ఇరికించారు' అన్నాడు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సర్పంచ్ హత్య కేసులో వాల్మిక్ కరాద్ ప్రధాన సూత్రధారి అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అతన్ని  అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వేలాది మంది ప్రజలు బీడ్ నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో సహా అధికార మహాయుతి కూటమికి చెందిన ఎమ్మెల్యేలు కూడా నిరసనలో పాల్గొన్నారు. బీడ్‌కు చెందిన ఎన్‌సిపి మంత్రి ధనంజయ్ ముండే కరాద్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

ఇది కూడా చదవండి: Maha Kumbamela 2025: మహా కుంభమేళాకు రానున్న స్టీవ్‌జాబ్స్‌ భార్య

ఇదిలా ఉంటే.. కరాద్ అరెస్టులో జాప్యంపై సంతోష్ దేశ్‌ముఖ్ కుమార్తె వైభవి దేశ్‌ముఖ్ ప్రశ్నలు సంధించారు. తన గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు లొంగిపోతుంటే పోలీసులు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిందితులందరి కాల్‌ డిటైల్‌ రికార్డులను (సీడీఆర్‌) పోలీసులు తనిఖీ చేయాలని, వారు ఎవరితో కాంటాక్ట్‌లో ఉన్నారో గుర్తించాలని వైభవి దేశ్‌ముఖ్‌ డిమాండ్ చేశారు. కేసును సీఐడీకి అప్పగిస్తామని బీడ్‌కు చెందిన ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ బజరంగ్ సోనావానే తెలిపారు. పారదర్శక పద్ధతిలో దర్యాప్తు చేయాలి. తాను నిర్దోషినని వాల్మిక్ కరాద్ చెప్పడం విడ్డూరంగా ఉందని, ఈ విషయం చెప్పడానికి 20 రోజులు ఎందుకు పట్టింది? అంటూ విమర్శలు గుప్పించారు. 

ఇది కూడా చదవండి: తగలబడుతున్నHollywood.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా

Also Read: Cricketer Divorce: విడాకులకు సిద్ధమైన మరో టీమిండియా క్రికెటర్

Advertisment
తాజా కథనాలు