తగలబడుతున్నHollywood.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా

లాస్ ఏంజిల్స్ లో రెండు రోజు క్రితం కార్చిచ్చు అంటుకుంది. హాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధిచిన చాలా మంది ఇళ్ళు, ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి.స్టార్ నటీనటులు బెన్ అప్లెక్, టామ్ హ్యాంక్స్‌ , మైల్స్ టెల్లర్, స్టీవెన్ స్పీల్ బర్గ్, సైతం రోడ్డు మీద నిలబడ్డారు.

New Update
Hollywood Actors

Hollywood Actors

అమెరికా మీద ప్రకృతి కన్నెర్ర చేసింది. ఓ పక్క మంచు తుపానులు, మరో పక్క కార్చిచ్చు. ఈ రెండింటితో అక్కడి ప్రజలు సతమతమవుతున్నారు.అమెరికా లాస్ ఏంజిల్స్ లో రెండు రోజు క్రితం కార్చిచ్చు అంటుకుంది. అడవుల్లో అంటుకున్న కార్చిచ్చు సిటీలోకి వచ్చింది. దీంతో లాస్ ఏంజిల్స్ లోని ఇళ్ళు, షాప్స్ అగ్నికి ఆహుతి అవుతున్నాయి. హాలీవుడ్ హిల్స్, హాలీవుడ్ సినిమాలకు, హాలీవుడ్ నటీనటులకు లాస్ ఏంజిల్స్ పెట్టింది పేరు.

anthony
anthony

Also Read: Game Changer: బాబూ శంకరూ... ఇంకా అదే పాత చింతకాయి పచ్చడి అయితే ఎలా? రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ ఆవేదన

దీంతో చాలా మంది హాలీవుడ్ నటీనటుల ఇళ్లు కూడా ఈ కార్చిచ్చుకు దగ్డం అయ్యాయని హాలీవుడ్ మీడియాలు తెలిపాయి. యూజీన్ లెవీ, బెన్ అప్లెక్, టామ్ హ్యాంక్స్‌ , మైల్స్ టెల్లర్, స్టీవెన్ స్పీల్ బర్గ్, మైకేల్ కేతన్, బెన్ అఫ్లెక్, సాండ్రా లీ, మిలి సైరస్, మార్క్ హామిల్, మాండీ మూర్, పారిస్ హిల్టన్, హెడీ మోంటాగ్, ఫెర్గీ, రికీ, స్పెన్సర్ ప్రాట్,క్యారీ ఎల్వెస్, మెలిస్సా,  లైటన్ మీస్టర్, ఆడమ్ బ్రాడీ, అన్నా ఫారిస్, ఆంథోనీ హాప్కిన్స్, బిల్లీ క్రిస్టల్, జాన్ గుడ్‌మాన్, కామెరాన్ మాథిసన్,కోబీ స్మల్డర్స్, డయాన్ వారెన్,  టామ్ హాంక్స్, రీటా విల్సన్, అలబామా బార్కర్, లాండన్ బార్కర్.. ఇలా చాలా మంది హాలీవుడ్ స్టార్స్ ఇళ్ళు కార్చిచ్చుకు ఆహుతయ్యాయి. 

వీళ్ళే కాకుండా అక్కడ నివసించే హాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధిచిన చాలా మంది ఇళ్ళు, వారి ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి.దీంతో స్టార్ నటీనటులు సైతం కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడ్డారు. ఆస్తి నష్టం అయితే భారీగానే జరిగింది. ప్రాణ నష్టం విషయ వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. సామాన్యుల ఇళ్ళు సైతం అగ్నికి ఆహుతవడంతో వేలాదిమంది కట్టుబట్టలతో మిగిలారు. హాలీవుడ్ హిల్స్ లో కూడా అనేక షూటింగ్ ప్రదేశాలు ఈ కార్చిచ్చు లో ఆహుతయ్యాయి.

Also Read: USA: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా

hollywood star
hollywood star

 

ఆస్కార్‌ నామినేషన్ల ప్రక్రియ కూడా..

లాస్ ఏంజిల్స్ కార్చిచ్చుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హాలీవుడ్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో హాలీవుడ్ సినిమా షూటింగ్స్ కి బంద్ ప్రకటించారు. లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు కారణంగా ఆస్కార్‌ నామినేషన్ల ప్రక్రియ కూడా వాయిదా పడింది. హాలీవుడ్ సినీ పరిశ్రమ అంతా లాస్ ఏంజిల్స్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆస్కార్‌ అవార్డుల వేడుక కూడా అక్కడే జరగనున్న విషయం తెలిసిందే.

hollywood actor
hollywood actor

 

 జనవరి 8 నుంచి 14 వరకు ఆస్కార్‌ నామినేషన్‌ ప్రక్రియ జరగనున్నవిషయం తెలిసిందే. కార్చిచ్చు నేపథ్యంలో జనవరి 17న ప్రకటించాల్సిన ఆస్కార్‌ నామినేషన్లను జనవరి 19కు వాయిదా పడింది. అన్నిరకాలుగా హాలీవుడ్ సినీ పరిశ్రమ ఈ కార్చిచ్చుతో భారీగా నష్టపోయినట్లు తెలుస్తుంది.

Also Read: Cricketer Divorce: విడాకులకు సిద్ధమైన మరో టీమిండియా క్రికెటర్

Also Read:Nora Fatehi: కార్చిచ్చులో ఇరుక్కుపోయిన నటి.. వీడియో వైరల్‌.. అమెరికాలో ఏం జరుగుతోంది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు