USA: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా

నార్త్, ఈస్ట్, మిడిల్ అంతా మంచు తుఫానుతో కూరుకుపోతుంటే సౌత్ మండే మంటల్లో ఆహుతి అయిపోతోంది. ప్రస్తుతం ఇదీ అగ్రరాజ్యం పరిస్థితి. అటు హిమపాతానికి...ఇటు కార్చిచ్చుకు అక్కడ ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. వారం రోజులుగా నానాపాట్లు పడుతున్నారు. 

New Update
usa

Wild Fire, Snow Storm

ప్రస్తుతం అమెరికా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఇప్పటివరకూ ఏ దేశమూ ఎదుర్కొని ఉండదు. ఒకేసారి అతిశీతలం, మండే మంటలతో అల్లల్లాడిపోతోంది అమెరికా. ఉన్న 50 రాష్ట్రాలో దాదాపు అన్నీ ఏదొ ఒక బాధను ఎదుర్కొంటున్నాయి. సుమారు 30 రాష్ట్రాలు మంచు తుఫానులో కూరుకుపోతే...సౌత్‌లో ఉన్న కాలిఫొర్నియాను కార్చిచ్చు దహించేస్తోంది. మొత్తానికి రెండు చోట్లా ప్రజలు తెగ ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా కురుస్తున్న మంచు కారణంగా అమెరికాలోని తూర్పు, మధ్య, ఉత్తర ప్రాంతాలు చలికి వణికిపోతున్నాయి. మరోవైపు మూడు రోజుల కిందట మొదలైన అగ్నితో కాలిఫోర్నియా మొత్తం దగ్దధమైపోతోంది. దాదాపు 70 వేల మంది తమ ఇళ్ళను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. 

మంచేస్తున్న మంచు...

అమెరికాలోని మధ్య, దక్షిణాది రాష్ట్రాల నుంచి తూర్పు తీరం వరకు తీవ్రమైన మంచు తుఫాను, రక్తం గడ్డ కట్టే చలి జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగాపడిపోయి ఇళ్ళల్లో నుంచి బయటకు రాకుండా చేసేశాయి. రోడ్ల మీద భారీగా మంచు నిలిచిపోయింది. దీంతో ఒక్కరోజే 500 కు పైగా యాక్సిడెంట్లు అయ్యాయి. 

అమెరికా పై మంచు తుఫాన్  తీవ్ర ప్రభావాన్ని చూపించింది. వింట‌ర్ స్టార్మ్ సుమారు 6 కోట్ల మంది అమెరిక‌న్ల‌పై తీవ్ర ప్ర‌భావం పడింది. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో అత్య‌ల్పంగా -18 డిగ్రీల  ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. కాన్సాస్ సిటీపై ఈ మంచు తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉంది. వర్జీనియా, వాషింగ్టన్, మేరీలాండ్ లాంటి సిటీలో 12 సె.మీల మంచుతో కూరుకుపోయాయి. వారం రోజులుగా అక్కడ జనజీవనం స్తంభించిపోయింది. సుమారు 30 రాష్ట్రాల్లో బ్లెయిర్ మంచు తుఫాన్ ప్రభావం ఉంది. వెస్ట్ వ‌ర్జీనియా, అర్కాన్సాస్‌, న్యూజెర్సీ,మిస్సోరీ, కెంట‌కీ, వాషింగ్టన్ రాష్టాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. పోలార్ వొర్టెక్స్ వ‌ల్ల విప‌రీత వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ నిపుణులు వివరించారు. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న‌ చ‌ల్ల‌టి గాలి.. సెంట్ర‌ల్ అమెరికాను తీవ్రంగా వణికిస్తోంది. ఈ రాష్ట్రాల్లో అత్యల్పంగా –0 నుంచి –15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిల‌డెల్పియాలో స్కూళ్లు, ప్ర‌భుత్వ ఆఫీసుల‌ను మూసివేశారు. లూసియానా, కెంట‌కీ ,  మిస్సోరీ, ఇలియ‌నాస్‌ రాష్ట్రాల్లో.. సుమారు రెండు ల‌క్ష‌ల ఇళ్లకు విద్యుత్‌ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. 

కాల్చేస్తున్న కార్చిచ్చు...

ఇదిలా ఉంటే అమెరికాలోని సౌత్ ప్రాంతం మండిపోతోంది. అక్కడి కాలిఫోర్నియా రాష్ట్రాన్ని కార్చిచ్చు కాల్చేస్తోంది. దాదాపు 3వేల ఎకరాలను నాశనం చేసేసింది. మూడు రోజలుగా లాస్ ఏంజెలెస్ చుట్టుపక్కల ప్రాంతాలను అగ్ని దహిస్తూనే ఉంది. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రావడం లేదు. అంతకంతకూ వ్యాపిస్తోంది. తాజాగా ఇది హాలీవుడ్ స్టూడియోతో పాటూ పెద్ద పెద్ద నిర్మాణాలున్న కొండలపైకి కూడా పాకింది. ఇపటకే 1.3 లక్షల మంది ఇళ్ళను ఖాళీ చేయాల్సి వచ్చింది. 

గంటకు వంద మైళ్ళ వేగంతో గాలులు వీస్తుండడంతో మంటలను అదుపులోకి తీసుకురావడం కష్టమవుతోంది. మరోవైపు కాలిఫోర్నియాలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది సరిపోవడం లేదు. దీంతో పక్క రాష్ట్రాల నుంచి వారిని రప్పిస్తున్నారు. గత 24 గంటల్లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్,గ్రేటర్ లాస్ ఏంజిల్స్ ప్రాంతాల నుండి 70,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటకి ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. 

ఈశాన్యంలో పుట్టిన అగ్ని...

లాస్‌ ఏంజెలెస్‌ (Los Angeles) లో ప్రకృతికి నిలయమైన ఈశాన్య ప్రాంతంలోని పర్వతాలు మొదట మంటలు స్టార్ట్ అయ్యాయి. బలమైన గాలుల కారణంగా అది వేగంగా విస్తరించింది. అక్కడి నుంచి అది రాజుకుంటూ మొత్తం నగరాన్ని కబళించింది. దాంతో పాటూ పసిఫిక్‌ పాలిసాడ్స్‌ ప్రాంతంలో మరో అగ్గి రాజుకుంది. ఇది తీరం వెంట ఉన్న సెలబ్రిటీల నివాస ప్రాంతం మొత్తాన్ని కమ్మేసింది. ఇప్పటివరకు రెండువేల ఇళ్ళు  అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు 5 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. 

లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చులో అతిపెద్దదైన పాలిసాడ్స్‌ ఫైర్‌ కారణంగా 15,800 ఎకరాలు, ఈటన్‌ ఫైర్‌ వల్ల ఆల్టడేన, పసాడెనా ప్రాంతాల్లోని 10 వేల ఎకరాలు, సన్‌సెట్‌ ఫైర్‌ 5 వేలకు పైగా ఎకరాలు, హురెస్ట్‌ ఫైర్‌ సైల్మర్‌లో 700 ఎకరాలు, లిడియా ఫైర్‌ 340 ఎకరాలను బుగ్గిపాలు అయ్యాయి. 205లో ఇలాంటి కార్చిచ్చు సంభవించిందని...దాని తరువాత ఇదే అతి పెద్దది అని అక్కడి అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు అక్కడి ప్రజలు కరెంట్, నీరు లేక సతమతమవుతున్నారు. మాలిబు మొదలు.. శాన్‌ డియాగో కౌంటీ వరకు దక్షిణ కాలిఫోర్నియాలో 1.6 కోట్ల జనాభా ఉంటుం ది. ఈ ప్రాంతాలకు అధికారులు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు ‘శాంటాఅనా’ గాలులు బలంగా వీస్తాయని, దీంతో.. పరిస్థితులు మరింత జటిలంగా మారే ప్రమాదాలున్నాయని హెచ్చరించారు. ఆస్కార్ అవార్డుల వేడుకను కూడా రద్దు చేశారు. 

మంటల్లో హాలీవుడ్ యాక్టర్స్ ఇళ్ళు..

పసడెనాలో 500 వరకూ సంపన్నుల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. తమ ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయని హాలీవుడ్‌ ప్రముఖులు మాండీ మూర్, కారీ ఎల్వ్స్, పారిస్‌ హిల్టన్‌ తెలిపారు. పాలిసాడ్స్‌లో చెలరేగిన మంటల్లో 45 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని కోల్పోయామని బిల్లీ క్రిస్టల్‌ వెల్లడించారు. పాలిసాడ్స్‌లో లైబ్రరీ, రెండు పెద్ద కిరాణా దుకాణాలు, బ్యాంకులు, పలు బొటిక్స్‌ ధ్వంసమయ్యాయి. దాంతో పాటూ ఫైమస్ యాక్ట్రసే నోరా ఫతేహీ, అధ్యక్షుడు బైడెన్ కుమారుడు హంటర్ ఇల్లు కూడా కాలి బూడిద అయిపోయాయి. హంటర్ ఉంటున్న ఇల్లు 1950లో నిర్మించారు.75 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఇల్లు విలాసవంతంగా ఉంటుందని...చాలా ఖరీదైనది అని చెబుతున్నారు. మొత్తం నామ రూపాల్లేకుండా ఇల్లంతా బూడిద అయిపోయిందని చెబుతున్నారు. 

Also Read: Nora Fatehi: కార్చిచ్చులో ఇరుక్కుపోయిన నటి.. వీడియో వైరల్‌.. అమెరికాలో ఏం జరుగుతోంది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు