Kamal Haasan : రాజ్యసభకు కమలహాసన్..డీఎంకే మద్దతుతో పెద్దల సభకు..

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌హాసన్‌ రాజ్యసభకు వెళ్లడం ఖాయమైంది. తమిళనాడు నుంచి ఆయనకు ఈ పదవి దక్కనుంది. కమల్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ డీఎంకే అధికారిక ప్రకటన చేసింది. డీఎంకే, ఎన్‌ఎంఎం ల ఒప్పందం ప్రకారం కమల్ పెద్దల సభకు వెళ్లనున్నారు.

New Update
Kamal Haasan

Kamal Haasan to Rajya Sabha

Kamal Haasan : ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌ హాసన్‌ రాజ్యసభకు వెళ్లడం ఖాయమైంది. తమిళనాడు నుంచి ఆయనకు ఈ పదవి దక్కనుంది. కమల్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ డీఎంకే బుధవారం అధికారిక ప్రకటన చేసింది. రాజ్యసభలో ఖాళీగా ఉన్న 8 స్థానాలకు వచ్చే నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఆరు తమిళనాడు నుంచి రెండు అసోం నుంచి ఉన్నాయి. కాగా తమిళనాడులో అధికార పార్టీ డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాగా దీని ప్రకారం నాలుగు సీట్లు డీఎంకేకు, రెండు అన్నాడీఎంకేకు దక్కే అవకాశం ఉంది.

Also Read: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే

తమిళనాడుకు చెందిన అన్బుమణి రామదాస్‌, ఎం. షణ్ముగమ్‌, ఎన్‌. చంద్రశేగరన్‌, ఎం.మహమ్మద్ అబ్దుల్లా, పి.విల్సన్, వైగో రాజ్యసభ పదవీకాలం జులై 25తో ముగిసింది. కాగా కమల్‌హసన్‌తో పాటు  సిట్టింగ్‌ ఎంపీ విల్సన్‌, తమిళ రచయిత సల్మా, డీఎంకే నేత ఎస్‌ ఆర్‌ శివలింగంలను డీఎంకే తమ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో వీరంతా ఏకగ్రీవంగా రాజ్యసభకు వెళ్లడం లాంఛనమే అని తెలుస్తోంది.


 ALSO READ: ఎన్టీఆర్‌ జయంతి.. జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి


2018, ఫిబ్రవరి 21న కమల్‌ హాసన్‌ ఎన్‌ఎంఎం(Makkal Needhi Maiam) పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసినప్పటికీ. ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే.. ఓటు షేర్‌ మాత్రం గతం కంటే పెరిగి 3.72 శాతం దక్కించుకుంది. చెన్నై, కోయంబత్తూరు, మధురైలో భారీగా ఓట్లు పడ్డాయి. 

so Read: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

కాగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్‌ఎంఎం పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేదు. కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్‌.. బీజేపీ అభ్యర్థి వనతిశ్రీనివాసన్‌ చేతిలో 1,728 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 140 స్థానాలకు పోటీ చేసినా..ఒక్కటీ గెలవలేదు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌ ఇండియా కూటమికి మద్దతు ప్రకటించి ప్రచారం కూడా చేశారు. ఆ సమయంలో డీఎంకే ఎంఎన్‌ఎం మధ్య ఓ ఒప్పందం కుదిరింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడమా? లేదంటే రాజ్యసభకు వెళ్లడమా? అనే ఛాయిస్‌ కమల్‌కు డీఎంకే ఇచ్చింది. దీంతో ఆయన రాజ్యసభకు వెళ్లడానికే మొగ్గు చూపడంతో నాటి ఒప్పందం ప్రకారం డీఎంకే పార్టీ అధినేత స్థాలిన్‌ కమల్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

Also Read: హార్వర్డ్‌ యూనివర్సిటీపై ట్రంప్ మరో బాంబ్.. వాళ్ల వివరాలు కావాలని డిమాండ్

Advertisment
Advertisment
తాజా కథనాలు