/rtv/media/media_files/2025/05/28/NV2H6tEeW8WJGYw11iVb.jpg)
NTR Jayanthi
NTR Jayanthi:
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్(Hyderabad)లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్(Kalyan Ram) నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు భారీగా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ఎన్టీఆర్ జయంతిని నిర్వహించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఎస్ విజయానంద్ ప్రత్యేక జీవో జారీ చేశారు.
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!