Crime: తల్లి వివాహేతర సంబంధం.. ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన కొడుకు
తమిళనాడులో దారుణం జరిగింది. కన్నతల్లినే కొడుకు ఇనుపరాడ్డుతో కొట్టి చంపడం కలకలం రేపింది. నెల్లై జిల్లా ఎడుప్పల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో కొడుకు తల్లిని దారుణంగా హత్య చేశాడు.