/rtv/media/media_files/2025/08/09/india-most-wanted-2025-08-09-19-03-17.jpg)
India most wanted
భారతదేశంలో అక్రమ ఆయుధాల వ్యాపారం చేస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్(Most Wanted Criminal) ను ఢిల్లీ పోలీసులు(Delhi Police Investigation) అరెస్ట్ చేశారు. చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న నిందితున్ని నేపాల్‌లో ఈ రోజు అరెస్ట్ చేశారు. అక్రమ ఆయుధాల సరఫరా కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న నిందితుడు షేక్ సలీమ్ అలియాస్ సలీమ్ పిస్టల్‌ఈరోజు అరెస్ట్ అయ్యాడు. ఢిల్లీ పోలీసులు అతన్ని నేపాల్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, భారత భద్రతా సంస్థలు, నేపాల్ పోలీసుల సాయంతో సలీమ్ పిస్టల్‌ను అరెస్టు చేశాయి.
Also Read : తిరిగి రారా తమ్ముడా.. చితిపైనే తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
India's Most Wanted Criminal Arrested
సలీమ్ పాకిస్థాన్ నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుని, భారత్‌లోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. అంతేకాక, సలీమ్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ, దావూద్ గ్యాంగ్‌తో పాటు పలు నిషేధిత సంస్థలతోనూ సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. లారెన్స్ బిష్ణోయ్, హషీమ్ బాబా వంటి దేశంలో టాప్ గ్యాంగ్‌స్టర్‌లకు సలీమ్ పిస్టల్ ఆయుధాలు సరఫరా చేసేవాడని కేంద్ర దర్యాప్తు బృందాలు వెల్లడించాయి. అయితే గతంలో ఒకసారి 2018లో సలీంను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, పోలీసుల కళ్లు కప్పి సలీమ్ తప్పించుకుని విదేశాలకు పారిపోయాడు. అప్పటి నుంచి అతడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే సమాచారం మాత్రం తెలియలేదు. దీంతో అతన్ని ఇండియా మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు.
కాగా నాటి నుంచి అతనికోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి . ఈ క్రమంలో సలీమ్ నేపాల్‌లో దాక్కున్నాడని భారత్ భద్రతా సంస్థలకు ఇటీవల సమాచారం వచ్చింది. ఈ సమాచారం ఆధారంగా భద్రతా సంస్థలు అతన్ని లోకేషన్ ను ట్రాక్ చేసి నేపాల్‌లో అరెస్టు చేశాయి. ఢిల్లీలోని జాఫ్రాబాద్‌కు చెందిన షేక్ సలీమ్ కేవలం 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. చదువు మానేసిన సలీమ్ అనంతరం కొంతకాలం డ్రైవర్‌గా కూడా పనిచేశాడు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో గోడకూలి ఏడుగురు మృతి, మృతుల్లో ఇద్దరు చిన్నారులు
2000లో తొలిసారి వాహన దొంగతనంతో అతను తన క్రిమినల్ జీవితం ప్రారంభించాడు. ఆ తర్వాత తన అనుచరులు ముకేష్ గుప్తా, ఉర్ఫ్ కాకాతో కలిసి అనేక వాహనాలను దొంగిలించాడు. ఈ క్రమంలో అరెస్టు అవ్వటంతో భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 379, 411, 34 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత, 2011లో జాఫ్రాబాద్‌లో రూ.20 లక్షలతో కూడిన హై-ప్రొఫైల్ ఆర్మ్డ్ దొంగతనం కేసులో అతను పాల్గొన్నాడు. 2013న అతను మరోసారి అరెస్టయ్యాడు. అయితే పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. ఆనాటి నుంచి రెండున్నర దశాబ్ధాలుగా అతడి నేర చరిత్ర కొసాగుతూ వస్తోంది.
ఇది కూడా చదవండి: ఇండియన్లే భారతీయతను మర్చిపోతున్నారా..ఢిల్లీ రెస్టారెంట్ లో ఓ జంటకు అవమానం
wepons | india-nepal | delhi-police-special-cell | arrested-by-delhi-police