/rtv/media/media_files/2025/08/09/delhi-restuarent-2025-08-09-08-01-06.jpg)
Delhi Restaurent
దేశ రాజధాని ఢిల్లీలో ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. భారతీయ వస్త్రధారణ అయిన కుర్తా ధరించి వచ్చారని వారిని రెస్టారెంట్ లోకి రానివ్వలేదు. పితాంపురలోని ఓ రెస్టారంట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. రెస్టారెంట్ లోకి అందరినీ అనుమతించారని తమను మాత్రమే రానివ్వలేదని ఆ జంట చెబుతోంది. తమతో మాత్రం మేనేజర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆ జంట ఆరోపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రెస్టారెంట్ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. దీనిపై ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా కూడా రెస్పాండ్ అయ్యారు. దీన్ని సీఎం రేఖా గుప్తా దృష్టికి కూడా తీసుకెళ్ళామని చెప్పారు.
How can a restaurant in India
— MANOGYA LOIWAL मनोज्ञा लोईवाल (@manogyaloiwal) August 8, 2025
stop entry in India
for wearing an Indian wear…
Dear @KapilMishra_IND ji,
Please look into the matter.
pic.twitter.com/f1ueFvPIco
చర్యలు తీసుకున్నాం..
రెస్టారెంట్ వ్యవహారంపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేసి తక్షణ చర్యలకు ఆదేశించారు. అంతేకాకుండా ఇకపై ఏ రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్స్ నై ఎలాంటి ఆంక్షలు విధించకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రెస్టారంట్ నిర్వాహకులు భారతీయ దుస్తులలో వచ్చే వారిని స్వాగతిస్తామని చెప్పారన్నారు. రక్షాబంధన్ రోజున భారతీయ దుస్తుల్లో వెళ్లే సోదరీమణులకు వారు కొన్ని తగ్గింపులను సైతం అందిస్తారని మంత్రి కపిల్ మిశ్రా చెప్పారు. అయితే మరోవైపు రెస్టారెంట్ యాజమాన్యం ఇదంతా అబద్ధమని అంటోంది. ఆ జంట టేబుల్ బుక్ చేసుకోలేదని అందుకే వారిని లోపలికి అనుమతించలేదని చెప్పింది. రెస్టారంట్‌లో ఎలాంటి వస్త్రధారణ విధానం లేదని, కస్టమర్స్ అందరూ రావచ్చని చెప్పారు.
Also Read: Netanyahu: అబ్బో ఈయనే చెప్పాలి..ట్రంప్ విషయంలో మోదీకి సలహాలిస్తానంటున్న నెతన్యాహు