/rtv/media/media_files/2025/08/09/wall-collapse-in-delhi-2025-08-09-15-15-12.jpg)
Wall Collapse in delhi
దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో భారీ వర్షాలు(Heavy Rains) అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మృతిచెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. హస్తినలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా ఢిల్లీలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఢిల్లీలోని హరినగర్ జైత్‌పూర్‌లో శనివారం ఉదయం గోడ కూలడం(Wall Collapse) తో ఏడుగురు మృతిచెందారు.
ఇది కూడా చూడండి:ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. తవ్వకాల్లో దొరకని ఆస్తికలు.. ఎంత తవ్వుతున్న మట్టే!
Wall Collapse In Delhi
ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో 8 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. వీరిలో తీవ్రంగా గాయపడ్డ నలుగురుని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి భారీగా కురిసిన వర్షం కారణంగా హరి నగర్‌లో గోడ కూలిపోయింది. దీంతో జైత్‌పూర్‌లో ఉన్న పాత ఆలయం పక్కనే ఉన్న జగ్గీలలో నివసిస్తున్న వాళ్లు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగకుండా జగ్గీలను ఖాళీ చేయించామని సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ ఐశ్వర్య శర్మ తెలిపారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరి కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, రెస్య్కూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా, శనివారం కూడా ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అన్ని రంగాల అధికారులు అప్రమత్తమయ్యారు. కుంభవృష్టి వర్షం కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, భారీ వర్షాలు మూలంగా విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. 200లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలను రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పలు మెట్రో రైలు స్టేషన్లు కూడా వరదల్లో చిక్కుకున్నాయి. దీంతో మెట్రో స్టేషన్లకు వెళ్లాలనుకుంటున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వరదల మూలంగా మరిన్ని విపత్తులు సంభవించకుండా ఉండడానికి ప్రభుత్వం, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు.వరుసగా కురుస్తున్న వర్షాలతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండడటంతో అన్ని వర్గాల వారిని మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, ప్రమాద స్థలాల నుంచి దూరంగా ఉండాలని అధికారులు కొరుతున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని అవసరమైన ఏర్పాట్లు, మరింత మెరుగైన నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇది కూడా చూడండి:ట్రంప్‌కు భారత్ బిగ్ షాక్.. బెదిరింపులకు భయపడదే లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్
telugu-news | latest-telugu-news | telugu crime news | delhi-rains | national news in Telugu