Obscene Messages: యువతికి అసభ్య మెసేజ్ లు పంపాడని..బట్టలు విప్పించి.. ప్రైవేట్‌ బాగాలపై దాడి చేసి....

కర్ణాటక రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. తన లవర్ కు అసభ్యకర మెసేజ్‌లు పెట్టాడని ఓ యువకుడు.. మరో యువకుడిపై తన స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఏకంగా బట్టలు విప్పించి దాడి చేయడంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

New Update
Lover  Attack

Lover Attack

Crime news: కర్ణాటక రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. తన లవర్ కు అసభ్యకర మెసేజ్‌లు పెట్టాడని ఓ యువకుడు.. మరో యువకుడిపై తన స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఏకంగా బట్టలు విప్పించి దాడి చేయడంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారడంతో తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

Also Read: ట్రంప్‌కు ఝలక్‌ ఇచ్చిన ఎలాన్‌మస్క్‌..కొత్త పార్టీ ప్రారంభం

Obscene Messages To Young Woman

కర్ణాటక జిల్లా నెలమంగళ తాలుకా సోలదేవనహళ్లిలో కుశాల్‌ అనే యువకుడు గతంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఆ తర్వాత వారిద్ధరికీ బ్రేకప్‌ అయింది. ఆ తర్వాత ఆ యువతి మరో యువకుడితో లవ్ మొదలుపెట్టింది. అయితే ఈ విషయం కుశాల్ భరించలేకపోయాడు. ఈ విషయంలోనే సదరు యువతికి అసభ్య సందేశాలు పంపాడు. కుశాల్ పంపిన సందేశాలను సదరు యువతి తన తాజా ప్రియుడికి చెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు యువకుడు విషయం తన స్నేహితులతో చెప్పుకున్నాడు.

వారంతా కలిసి కుశాల్‌ను కిడ్నాప్‌ చేసి.. ఓ బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ పడేశారు. అనంతరం పదిమంది యువకులు కుశాల్ ను చుట్టుముట్టి కాళ్లతో, కర్రలతో దాడి చేశారు. అనంతరం బట్టలు విప్పించి.. ప్రైవేట్‌ బాగాలపై దాడి చేస్తూ హింసించారు. ఇక కుశాల్ పై దాడి జరుగుతున్న సమయంలో ఆ యువతి కూడా అక్కడే ఉండటం గమనార్హం. ఇదంతా ఒకెత్తయితే దాడికి పాల్పడిన సమయంలో ఆ గ్యాంగ్‌ మొత్తం కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి కేసు ప్రస్తావన తెస్తూ మరీ కుశాల్‌పై దాడి చేయడం సంచలనంగా మారింది. వీడు మరో రేణుకాస్వామి రా అంటూ ఒక్కొక్కరుగా కుశాల్‌ను విపరీతంగా కొట్టారు. అంతేకాదు రేణుకాస్వామికి పట్టిన గతే పడుతుందంటూ హెచ్చరించడం చర్చనీయంశంగా మారింది. 

ఈ ఘటన జరిగి వారం రోజులు దాటింది. సదరు వీడియోను బట్టి అది జూన్‌ 30వ తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు 10 మందిపై సోలదేవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో 8 మందిని అరెస్ట్‌ చేశారు. కిడ్నాప్, దాడి, బెదిరింపు, వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.  
Also Read: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!

lover attack | viral | a-man-attacked | attack | lovers | Bengaluru Incident | bengaluru

Advertisment
Advertisment
తాజా కథనాలు