ఊచకోత.. 52 మందిని కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపేశారు
ఆఫ్రికాలోని కాంగో దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు అక్కడి స్థానికులను ఊచకోత కోశారు. గొడ్డళ్లు, కత్తులతో 52 మందిని నరికి చంపేశారు.
ఆఫ్రికాలోని కాంగో దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు అక్కడి స్థానికులను ఊచకోత కోశారు. గొడ్డళ్లు, కత్తులతో 52 మందిని నరికి చంపేశారు.
రెండు మార్కులు తక్కువ వేసిందని టీచర్పైనే దారుణానికి ఒడిగట్టాడో ప్రభుద్ధుడు. ఆమెపై క్లాస్ రూములోనే విచక్షణా రహితంగా దాడి చేశాడు. రెండు మార్కుల కోసం లెక్కల టీచర్తో గొడవ పెట్టుకోవడమే కాకుండా ఆమెను కొట్టాడు. ఈ సంఘటన థాయ్లాండ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఆస్ట్రేలియాలో భారతీయులపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భారత విద్యార్థి సౌరభ్ ఆనంద్ పై దుండుగులు కత్తితో దాడి చేశారు. ఇందులో అతని చెయ్యి తెగిపోయింది.
అమెరికాలో గన్ కల్చర్, దాడులు చాలా ఎక్కువే జరుగుతుంటాయి. తాజాగా మిషిగన్ లోని ట్రావెర్స్ సిటీలోని వాల్ మార్ట్ సూపర్ సెంటర్ ఓ అగంతకుడు కత్తితో జనాలపై దాడి చేశాడు. ఇందులో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బోనాల పండుగ డ్యూటీలో ఉన్న ఉప్పల్ ఎస్ఐ, కానిస్టేబుళ్లపై దాడి జరిగింది. రామంతపూర్ బోనాల ఉత్సవాల్లో డ్యూటీలో ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్ పై బీఆర్ఎస్ నేతలు దాడి చేశారు. ఎస్సై మధుసూదన్, కానిస్టేబుల్ పై బీఆర్ఎస్ నాయకుడు అనిల్ అతని అనుచరులు దాడి చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దారుణం చోటు చేసుకుంది. దోనిపాటి మహేష్ అనే వ్యక్తి పై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అయినవిల్లి మండలం వెలువలపల్లికి చెందిన దోనిపాటి మహేష్ పై దాడి చేసిన ముగ్గురు దాడిసమయంలో వీడియోలు చిత్రీకరించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి చేశారు. తార్నాక లోని ఆర్టీసీ హాస్పటల్ దగ్గరలో ఓ వాహనంపై దూసుకు వచ్చిన సుమారు 50 మంది దుండగులు ఎమ్మెల్యేపై దాడి చేసి పరారయ్యారు.
సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసు స్టేషన్ ఆవరణలోనే ప్రత్యర్థిని కారుతో ఢీకొట్టి.. హత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది.
గురువారం మెదక్లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు. తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి, మంత్రి వివేక్ పై మక్క బుట్ట విసిరాడు.