Elon Musk : ట్రంప్‌కు ఝలక్‌ ఇచ్చిన ఎలాన్‌మస్క్‌..కొత్త పార్టీ ప్రారంభం

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అన్నంత పనిచేశాడు. ఇన్నాళ్లు కేవలం ట్రంప్‌ను తన దారికి తెచ్చుకునేందుకు మాత్రమే కొత్త పార్టీ నినాదం ఎత్తుకున్నాడని భావిస్తూ వస్తున్నఎలాన్ మస్క్ ట్రంప్ కు షాక్ ఇస్తూ ‘అమెరికా పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని లాంచ్​ చేశారు.

New Update
Elon Musk And Trump

Elon Musk America Party

Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అన్నంత పనిచేశాడు. ఇన్నాళ్లు కేవలం ట్రంప్‌ను తన దారికి తెచ్చుకునేందుకు మాత్రమే కొత్త పార్టీ నినాదం ఎత్తుకున్నాడని భావిస్తూ వస్తున్న ఎలాన్ మస్క్ అనుకున్నట్లే కొత్త పార్టీని ప్రకటించారు. అనేక ఏండ్లుగా రెండు పార్టీలతో సాగుతున్న అమెరికా రాజకీయాల్లో మూడో పార్టీ ఆవిర్భవించినట్లయింది.  ‘అమెరికా పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని లాంచ్​ చేస్తున్నట్టు టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ ప్రకటించారు.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొచ్చిన బిగ్​ బ్యూటిఫుల్​ బిల్లుకు ఆమోదం లభిస్తే తను కొత్త పార్టీ పెడతానని హెచ్చరించిన అపర కుబేరుడు ఎలాన్​ మస్క్..​ చెప్పింది చేశారు. 

Also Read : పెళ్లికాకుండా తల్లికాబోతున్న నటి.. 40 ఏళ్లలో IVF ద్వారా!

ఇన్నాళ్లు అమెరికా రాజకీయాల్లో కేవలం రిపబ్లికన్​, డెమొక్రటిక్​రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ పార్టీ ఆవిర్భవించినట్లయింది. ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ‘అమెరికా పార్టీ’ అనే మూడో రాజకీయ పార్టీని మస్క్​ తాజాగా లాంచ్​ చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన సూచనలకు సానుకూలంగా స్పందించిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, తన ప్లాట్‌ఫామ్ ఎక్స్​ వినియోగదారుల నుంచి అఖండ మద్దతు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

గతంలోనే పార్టీ పెడుతానని ప్రకటించిన ఆయన  "మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. అది మీకు లభిస్తుంది! ఈ రోజు, మీకు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది," అని ఎలాన్​ మస్క్​ 'ఎక్స్' గతంలో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే దాన్ని ఇప్పుడు నిజం చేశారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు మస్క్‌ బహిరంగంగానే మద్ధతు ప్రకటించారు. అయితే ఒకప్పటి కీలక మిత్రుడుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మస్క్​కి పెరుగుతున్న విభేదాల నేపథ్యంలో మస్క్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి:డ్వాక్రా మహిళలకు ఉప ముఖ్యమంత్రి శుభవార్త.. ఈ నెల 10 నుంచి చెక్కుల పంపిణీ

అయితే మొన్నటి ఎన్నికల్లో ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మస్క్ వందల మిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు. అంతేకాకుండా, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీకి అధిపతిగా ఉంటూ, ఖర్చులను తగ్గించాలని మస్క్​ అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత కొంత విబేధాలు వచ్చినప్పటికీ మళ్లీ సర్దుకు పోయినట్లు కనిపించింది. అయితే, "ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్" పేరుతో భారీ పన్ను కోత, వ్యయ బిల్లుపై ట్రంప్ సంతకం చేసిన తర్వాత ఈ వారం ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు.దీనికి ప్రతిస్పందనగా, టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ మస్క్ రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటానని కొన్ని రోజుల క్రితం సంకేతమిచ్చారు. ఈ చట్టానికి మద్దతు ఇచ్చిన చట్టసభ సభ్యులను పదవుల నుంచి తొలగించడానికి తన సంపదను వెచ్చిస్తానని ప్రతిజ్ఞ చేశారు.

ఇది కూడా చదవండి:డాక్టర్ చెప్పిన ఈ చిట్కాలతో చిన్నపాటి వ్యాధులను ఎదుర్కోవచ్చు

ఇక మస్క్‌ నిర్ణయంతో 2026 మధ్యంతర కాంగ్రెస్ ఎన్నికలలో తమ మెజారిటీ పై ప్రభావం చూపుతుందని రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మస్క్‌ తన పార్టీని ప్రారంభించడానికి ముందు, అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మస్క్ ఒక పోల్‌ను షేర్‌ చేశారు. అందులో, దాదాపు రెండు శతాబ్దాలుగా యూఎస్​ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించిన యూనిపార్టీ (రెండు పార్టీలు) వ్యవస్థ నుంచి స్వాతంత్ర్యం కావాలా?" అని ఆయన ప్రశ్నించారు. దానికి 1.2 మిలియన్లకు పైగా స్పందనలు వచ్చాయి. ఈ క్రమంలో మస్క్‌ అమెరికా పార్టీని ప్రకటించడం విశేషం.

Also Read : వంట చేసేటప్పుడు చేసే ఈ పొరపాటు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి తెలుసా!?

Advertisment
తాజా కథనాలు