/rtv/media/media_files/2025/06/04/7Dm8K2bH2AjcLQz7ljIP.jpg)
Mouneesha Chowdary : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సందర్భాల్లో సినిమా డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు తమను కమిట్‌మెంట్స్ ఇవ్వమని అడిగినట్లు పలువురు నటీమణులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దర్శక నిర్మాతలకు కమిట్మెంట్స్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని పలువురు బహిరంగానే చెప్పారు. తాజాగా మోడల్, నటి మౌనీషా చౌదరీ ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టింది. ‘‘ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి సినిమాలలో నటించమని నన్ను కోరారని తెలిపింది.
Also Read: Kamal Haasan: ‘థగ్ లైఫ్’ రిలీజ్ చేయండి.. కర్ణాటక హైకోర్టుకు కమల్ హాసన్!
Also Read : పవన్ కల్యాణ్ గొప్ప మనసు.. రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన PSPK.. కారణం అదే.. ?
Mouneesha Chowdary About Tollywood Director
ఇక తన మూవీలో అవకాశం ఇస్తానని నటించాలని నాకు ఆఫర్ కూడా ఇచ్చారని వెల్లడించింది. కానీ నాకు మాత్రం నటించడం ఇష్టం లేదని చెప్పినప్పటికీ అతను మాత్రం వినకుండా నా వెంట పడి నన్ను ఇబ్బంది పెట్టాడని ఆరోపించింది. అంతేకాకుండా ఒకరోజు నా తొడల కొలతలను కూడా అడిగి టార్చర్ పెట్టారని సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడు మాత్రం అతను పెద్ద సెలబ్రిటీలతో పాన్ ఇండియా సినిమాలను చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పి షాకిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మౌనిషా ఆ డైరెక్టర్ పేరు మాత్రం బయటపెట్టలేదు. దీంతో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ స్టార్ డెరెక్టర్ ఎవరు? పాన్ ఇండియా సినిమాలు చేస్తుందేవరూ ? అంటూ ఆరాతీస్తున్నారు.
Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు
Also Read : రూ. 80 కోట్ల ఓవర్సీస్ డీల్‌తో.. రజినీకాంత్ 'కూలీ' సంచలనం
heroine | films | Bollywood Heroine | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | telugu-cinema-news | telugu-film-news