Kamal Haasan: ‘థగ్‌ లైఫ్‌’ రిలీజ్ చేయండి.. కర్ణాటక హైకోర్టుకు కమల్ హాసన్!

స్టార్ హీరో కమల్ హాసన్ హైకోర్టును ఆశ్రయించారు. తన ‘థగ్‌ లైఫ్‌’ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే కన్నడ భాష వివాదం నేపథ్యంలో కమల్ చిత్రాన్ని కర్ణాటకలో బ్యాన్ చేయాలని నిరసనలు వినిపిస్తున్నాయి.

New Update
kamal moves to Karnataka high court for thug life release

kamal moves to Karnataka high court for thug life release

Kamal Haasan: కమల్ హాసన్ కన్నడ భాష వివాదం రోజురోజుకు  ముదురుతోంది. ఈ వివాదంతో కర్ణాటకలో ఆయన తాజా చిత్రం  ‘థగ్‌ లైఫ్‌’ విడుదల ప్రశ్నార్థకంగా మారింది. కమల్ క్షమాపణలు చెప్పకపోతే కర్ణాటకలో ఈ చిత్రాన్ని అడ్డుకుంటామని KFCC (కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ) హెచ్చరికలు చేస్తోంది. 

హైకోర్టుకు కమల్ హాసన్ 

ఈ నేపథ్యంలో కమల్ తాజాగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తన   ‘థగ్‌ లైఫ్‌’ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని  కోరారు. దీనికి సంబంధించిన పిటీషన్ ను తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌   ద్వారా దాఖలు చేశారు. తన సినిమా విడుదలకు ఇబ్బంది కలిగించకుండా పోలీసు శాఖకు, చలచిత్ర విభాగాలకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. థగ్ లైఫ్ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

 అసలేం జరిగింది

అయితే ఇటీవలే థగ్ లైఫ్ ఆడియో రిలీజ్ లో పాల్గొన్న కమల్ హాసన్ తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారాయి. కన్నడిగుల మనోభావాలు దెబ్బతీసేలా కమల్ వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు రాజకీయ నాయకులు, నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేశారు. దీంతో కమల్ హాసన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని లేదంటే కర్ణాటకలో ఆయన చిత్రాన్ని బ్యాన్ చేస్తామని నిరసనలు తెలుపుతున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు