Rasha Thadani: అప్పుడు మిస్.. ఇప్పుడు జాక్ పాట్! ఘట్టమనేని హీరోతో ర‌వీనా టాండ‌న్ కూతురు

ఘట్టమనేని కుర్ర హీరో జయకృష్ణ సరసన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూతురు రాషా త‌డానీ హీరోయిన్ గా నటిస్తున్నారనే వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

New Update
Rasha Thadani

Rasha Thadani

Rasha Thadani:  ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో కుర్ర హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు అన్నర‌మేష్ బాబు కుమారుడు జ‌య‌కృష్ణ హీరోగా తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే యాక్టింగ్ కెరీర్ కి సంబంధించి జయకృష్ణ  నటన, డాన్సులు, ఫైట్స్ లో పూర్తిగా శిక్షణ పొందారట. దీంతో ఘట్టమనేని ఫ్యామిలీ జయ కృష్ణను హీరోగా  లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 

ఆర్.ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణను హీరోగా లాంచ్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వైజయంతి మూవీస్  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

అప్పుడు మిస్..

 అయితే తాజా అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో..  అప్పట్లో తన గ్లామర్, డాన్సింగ్ స్టైల్, యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూతురు రాషా త‌డానీ జయకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారనే వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే కొద్దిరోజుల క్రితం నంద‌మూరి బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ జోడీగా ఈ బ్యూటీ నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ, ఏమైందో తెలియదు.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో రాషా టాలీవుడ్ ఎంట్రీకి కూడా చెక్ పడింది. అప్పుడు మిస్సైనా.. ఇప్పుడు జ‌య‌కృష్ణ  సినిమాతో రాషా  టాలీవుడ్ ఎంట్రీకి సిద్దమవుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్.

ఇప్పటికే రాషా  'ఆజాద్'  అనే సినిమాతో  హిందీ తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ జోడీగా మెరిసింది. రాషా కూడా తల్లికి తగ్గ తనయ అన్నట్లుగా ఈ సినిమాలో తన గ్లామర్, డాన్సింగ్ స్కిల్స్ తో కుర్రకారును, సినీ ప్రియులను ఫిదా చేసింది. ఏదేమైనా కెరీర్ ఆరంభంలోనే రాషా వరుసగా స్టార్ కిడ్స్ సరసన మెరిసే అవకాశాలు అందుకోవడం ఆసక్తికరంగా మారింది. 

Rasha Thadani
Rasha Thadani

ఇదిలా ఉంటే  రవీనా టాండన్  తెలుగులో నటించిన సినిమాలు తక్కువే! కానీ ప్రతి సినిమా కూడా పెద్ద హిట్టు. తన గ్లామర్, డాన్సింగ్ స్టైల్, యాక్టింగ్ తో 90's కలల రాణిగా వెలుగొందింది. అప్పట్లో బాలయ్య సరసన  'బంగారు బుల్లోడు' సినిమాతో సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో ఆమె  గ్లామర్, డాన్సింగ్ స్టైల్ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది.  90's లో టాలీవుడ్, బాలీవుడ్  స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలింది. ఇప్పుడు తన కూతురు రాషా  కూడా తన మార్గంలోనే అడుగులు వేస్తోంది. తన నటన నైపుణ్యాలతో మంచి అవకాశాలు అందుకుంటోంది. 

రాషా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ గ్లామరస్ ఫొటో షూట్లు, బ్రాండ్ ప్రమోషన్ వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది.  రాషా ఇన్ స్టాగ్రామ్ లో 3 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇది మాత్రమే కాదు రాషా ఫ్యాషన్ లుక్స్ నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి. 

Advertisment
తాజా కథనాలు