Rahul Gandhi: ఎవరు నచ్చకపోతే వాళ్ళను పంపేయొచ్చు..సీఎం, పీఎం 30 రోజుల జైలు బిల్లుపై రాహుల్ విమర్శ

ప్రధాని, ముఖ్యమంత్రి తొలగింపు బిల్లుపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దీని ప్రకారం అధికార పార్టీకి ఎవరి ముఖమైనా నచ్చకపోతే వారిని పదవి నుంచి తొలగించేయవచ్చని తీవ్రంగా విమర్శించారు. మనం మళ్ళీ రాజుల కాలం నాటికి వెళ్ళిపోతున్నామని కామెంట్ చేశారు.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

ఏదైనా అవినీతి, అక్రమాలు, క్రిమినల్ కేసుల్లో 30 రోజుల పాటు జైల్లో ఉండే ప్రజాప్రతినిధులకు వారి పదవి రద్దు అవుతుంది..ఈ బిల్లును ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. దీని ప్రకారం అధికార పార్టీకి ఎవరి ముఖమైనా నచ్చకపోతే  వారిని తొలిగించేయొచ్చు అంటూ కామెంట్ చేశారు. మందు ఈడీ కేసు నమోదు చేస్తుంది. తరువాత జైలుకు పంపించి..పదవి నుంచి తొలగిస్తారు అంటూ విరుచుకుపడ్డారు.  ప్రధానమంత్రులను లేదా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులను తొలగించడానికి అనుమతించే కొత్త బిల్లులు పాలక పార్టీలకు అనియంత్రిత అధికారాన్ని ఇస్తాయని రాహుల్ గాంధీ అన్నారు. ఈ బిల్లు మనల్ని రాజుల కాలానికి తీసుకువెళుతోందని మండిపడ్డారు. ఆ టైమ్ లో రాజులు తమనకు నచ్చని వారిని ఇష్టానుసారంగా ఇలానే తీసేసేవారని అన్నారు. మరోవైపు బీహార్ లో బీజేపీ...మహారాష్ట్ర తరహా ఓట్ల దొంగతనానికి ప్రయత్నిస్తోందని రాహుల్ ఆరోపించారు. కానీ రాబోయే ఎన్నికల్లో వారి ప్రయత్నాలు విఫలం అవుతాయని చెప్పారు. 

ఇప్పటి వరకూ లేని బిల్లు..

భారత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచీ ఇప్పటి వరకు చాలా మంది రాజకీయ నేతలూ, మంత్రులూ జైలుకు వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు. అయితే వారి శిక్షా కాలం పూర్తవగానే లేదా బెయిల్ మీద వచ్చినా..మళ్ళీ తమ పదవుల్లో కొనసాగారు. అయితే ఇక మీదట అలా చెల్లదు. ఎవరైనా పదవిలో ఉన్న నేత తీవ్ర నేరారోపణలతో జైలుకు వెళ్ళి వరుసగా 30 రోజులు ఉంటే వారి పదవి ఊడిపోతుంది. అది కేంద్ర మంత్రి అయినా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినా సరే..జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత తమ పదవికి రాజీనామా చేయాల్సిందే. ఈ కొత్త బిల్లు ప్రకారం ఐదేళ్ల శిక్ష పడేంత నేరానికి పాల్పడి...నెల రోజులు నిర్భందంలో ఉంటే..31వ రోజున వారి పదవి పోతుంది. ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలో ఇలాంటి నిబంధన లేదు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి వి.సెంథిల్‌ బాలాజీలు అరెస్టైనా తమ పదవులకు రాజీనామా చేయలేదు. 

ప్రతిపక్షాల వ్యతిరేకత..

ఈ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెడుతున్నప్పుడు రచ్చ రచ్చ జరిగింది. ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీన్ని వాడుకుని అధికార దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా పైకి పేపర్లు విసురుతూ గందరగోళం సృష్టించారు. అమిత్ షా గుజరాత్‌ హోంమంత్రిగా ఉన్నప్పుడు అరెస్టు అయ్యారంటూ విపక్ష ఎంపీలు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ సమయంలో నన్ను తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేసినప్పటికీ నైతికంగా తన పదవికి రాజీనామా చేశానంటూ విపక్ష నేతలకు కౌంటర్ ఇచ్చారు. 

Also Read: King Nagarjuna: తమిళ తంబీల మనసు దోచుకున్న కింగ్ నాగార్జున

Advertisment
తాజా కథనాలు