Maharaj In Tariff: యుద్ధానికి ఆజ్యం పోస్తూ లాభాలు సాధిస్తోంది..భారత్ పై సుంకాలు తప్పువు..ట్రంప్ సలహాదారు

అమెరికా, భారత్ ల మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ ఆజ్యం పోస్తోందని...అందుకే ఆ దేశానికి సుంకాల తగ్గింపు ఉండదని అన్నారు. 

New Update
peter

The longtime Trump aide said Indian refiners are cashing in while fuelling the war..Peter Navarro

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి కారణమవుతున్నారనే కారణంతో భారత్ పై 50 శాతం అదనపు సుంకాలతో విరుచుకుపడ్డారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇవి ఆగస్టు 27 నుంచి అమలు అవుతాయని చెప్పారు. ఈ డేట్ దగ్గర పడుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ సుంకాలపై అమెరికా ఏం మాట్లాడలేదు. ట్రంప్ మొదటి నుంచీ చర్చలకు తావు లేదని చెబుతున్నారు. దానికి తోడు రోజుకో అమెరికన్ అధికారి భారత్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో కూడా ఇండియాపై రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. 

సుంకాల గడుపు పెంచకపోవచ్చును..

భారతదేశంపై సుంకాలను రెట్టింపు చేయడంపై ట్రంప్ గడువును పొడిగిస్తారని తాను ఆశించడం లేదని పీటర్ నవారో అన్నారు.  సుంకాల్లో భారత్ మహారాజ్ వంటిదని చెప్పారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ న్యూ ఢిల్లీ లాభాలు గడించిందని..అమెరికాను మోసం చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ వివాదానికి భారత్ ఆజ్యం పోస్తోందని అన్నారు. నిజానికి ఇండియాకు రష్యా చమురు అక్కర్లేదు. కేవలం అధిక లాభాలను ఆర్జించడానికే వారు ఆ దేశం నుంచి చమురును కొనుగోలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడానికి ముందు..భారత్ వాస్తవంగా రష్యన్ చమురును కొనుగోలు చేయలేదు. అప్పుడు కేవలం ఒక శాతం మాత్రమే చమురు దిగుమతి చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ శాతం  35కి పెరిగింది.  నిజానికి ఇండియాకు  చమురు అవసరం లేదు. కేవలం ఇది రెండు దేశాల మధ్యనా లాభాల భాగస్వామ్య పథకం మాత్రమే అని పీటర్ ఆరోపించారు. భారత్...క్రెమ్లిన్ కు లాండ్రో మాట్ లాంటిదని అన్నారు. సుంకాల విధింపు తర్వాత వారు రష్యాతో మరింత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. మరోవైపు చైనాతో కూడా స్నేహాన్ని పెంచుకుంటున్నారని పీటర్ వ్యాఖ్యలు చేశారు. 

వాణిజ్యాన్ని మరిం విసృతం చేసిన మూడు దేశాలు..

మరోవైపు భారత్, రష్యా, చైనా...మూడు దేశాలు కలిపి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాక్ ఇవ్వనున్నాయని తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఇరు దేశాలతో భారత మంత్రులు ఈ విషయమై చర్చలు చేస్తున్నారు.  భారత విదేశాంగ శాఖ  మంత్రి ఎన్. జై శంకర్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్ పర్యటనలో ఉన్నారు.  ఈ విధంగా రెండు దేశాలతో ఒకేసారి భారత్ వాణిజ్యంపై చర్చలు జరుపుతోంది. అమెరికా చెక్ పట్టే విధంగా పావులు కదుపుతోంది.  భారత వస్తువులను రెండు దేశాలకు ఎగుమతి చేసేలా ఒప్పందాలు చేసుకుంటోంది. దీనికి రష్యా, చైనాలు కూడా అంగీకారం తెలిపాయని తెలుస్తోంది. ట్రంప్ ఎంత సుంకాలు పెంచినా రష్యా నుంచి భారత్ కు చమురు ఎగుమతి అవుతుందని ఆ దేశ  ఉప ప్రధాని డెనిస్‌ స్పష్టం చేశారు. దాంతో పాటూ విద్యుదుత్పత్తి, ఉక్కు తయారీకి అవసరమైన బొగ్గును కూడా రవాణా చేస్తామన్నారు. అలాగే భారత్ లో తయారయ్యే వస్తువులను దిగుమతి చేసుకుంటామని రష్యా ఉప ప్రధాని డెనిస్ స్పష్టం చేశారు. అలాగే  చైనా కూడా ఇదే మద్దతును ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా వస్తువులను తమ మార్కెట్ లోకి ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. దాంతో పాటూ నేపాల్ సరిహద్దు లిపులేఖ్ గుండా వ్యాపారం పునరుద్ధరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

Also Read: USA: 55 మిలియన్ వీసాల తనిఖీ..ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్

Advertisment
తాజా కథనాలు