/rtv/media/media_files/2025/08/10/fake-police-station-busted-in-noida-2025-08-10-21-44-43.jpg)
Fake police station busted in Noida, was being used to collect donations for ops
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్‌నే ఏర్పాటు చేశారు. ఫేక్ పత్రాలు, ఫేక్ ఐడీలు, పోలీసుల చిహ్నాలతో ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. అసలు విషయం బయటికొచ్చాక అందరూ నోరెళ్లబెట్టారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. నోయిడాలోని ఫేజ్ 3 ప్రాంతంలో ఫేక్ అంతర్జాతీయ పోలీస్ కార్యాలయాన్ని, అంతర్జాతీయ నేర దర్యాప్తు సంస్థను కొంతమంది కలిసి ఏర్పాటు చేశారు.
Also Read: ఎయిర్ ఇండియా ఫ్లైట్లకు కొత్త రూపు రేఖలు... సీట్లు, కర్టెన్ల నుంచి టాయిలెట్ల వరకు..
అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ సభ్యులుగా తాము పనిచేస్తున్నట్లు నటించారు. ఫేక్ పత్రాలు, ఫేక్ గుర్తింపు కార్డులు, పోలీస్ చిహ్నాలను వినియోగించి డబ్బులు వసూలు చేస్తున్నారు. www.intlpscrib.in అనే వెబ్‌సైట్ వినియోగించి ఆన్‌లైన్‌లో కూడా విరాళాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం ఫేక్ జాతీయ, అంతర్జాతీయ ధృవీకరణ పత్రాలు అందులో పోస్ట్ చేశారు. అయితే చివరికి ఈ ఫేక్ ఇంటర్వేషనల్ పోలీస్ స్టేషన్ గురించి నోయిడా పోలీసుల దృష్టికి వచ్చింది.
Also Read: ఎన్నికల సంఘంపై యుద్ధం.. మరో సంచలన డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ
వాళ్లు అక్కడి వెళ్లి తనిఖీ చేయగా అదంతా ఫేక్ అని తేలింది. దీంతో ఆ పోలీస్ స్టేషన్‌ను సీజ్ చేశారు. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వాళ్ల నుంచి ఫేక్ ఐడీలు, పత్రాలు, చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆ నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారిగా గుర్తించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘదియాబాద్‌లో ఓ ఫేక్ విదేశీ రాయబార కార్యలయం బయటపడటం సంచలనం రేపింది. ఇప్పుడు తాజాగా ఏకంగా ఫేక్ అంతర్జాతీయ పోలీస్ స్టేషన్ బయటపడటం చర్చనీయాంశమవుతోంది.
Also Read: అమెరికా పతనం మొదలైంది..సుంకాల తర్వాత వాల్ మార్ట్ లో ధరల పెరుగుదల
ఇదిలాఉండగా గతంలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఓ నకిలీ కోర్టును కూడా పోలీసులు గుర్తించారు. మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ అనే వ్యక్తి దాదాపు ఐదేళ్లుగా న్యామూర్తిగా నటిస్తూ.. తన ఆఫీసును కోర్టుగా మార్చేశాడు. తనవద్దకు వచ్చే ప్రజల వద్ద డబ్బులు తీసుకునేవాడు. అయితే 2019లో ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసులో మోరిస్ తన క్లయింట్‌కు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశాడు. చివరికీ దినపై సివిల్ కోర్టులో అప్పీల్ చేయగా.. ఆ ఉత్తర్వులు నికిలీవని తేలింది. మోరిస్ బండారం బయటపడటంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. చీటింగ్, ఫోర్జరీ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు అంతకుముందు గుజరాత్‌లోనే ఫేక్ టోల్ ప్లాజా, ఫేక్ బ్యాంకు, ఫేక్ పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. కేటుగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటి అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు.
Also Read: తీసుకున్న గొయ్యిలో పడ్డ పాకిస్తాన్.. 2 నెలల్లో రూ.1,240 కోట్లు నష్టం
Also Read: సింగపూర్ లో రజనీకాంత్ మేనియా..నేషనల్ డే కవాతుకు స్పెషల్ రీల్