/rtv/media/media_files/2025/08/10/new-look-for-air-india-flights-2025-08-10-19-49-13.jpg)
New look for Air India flights.
Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా నిలిచింది. వందలాదిమంది మృతికి కారణమైన ఈ విమాన ప్రమాదం తర్వాత విమానాల నిర్వహణ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ విమానయాన సంస్థకు పలు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, ప్రమాదం తర్వాత ఎయిర్‌లైన్ ఎయిర్ ఇండియా అనేక విమానాలను రద్దు చేసింది. కాగా తిరిగి తన విమానాలను పునరుద్ధరించడానికి $400 మిలియన్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. వైడ్‌బాడీ, నారోబాడీ విమానాలు రెండూ వాటి కార్యకలాపాలలో సౌకర్యం, సాంకేతిక నైపుణ్యాన్ని నిర్ధారించడానికి అధునాతన డిజైన్‌లతో పునరుద్ధరింప జేయడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా వాటిని ఆధునికంగా తీర్చిదిద్దడానికి విమానయాన సంస్థ ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చూడండి: IAF: ఆరు పాకిస్థాన్ యుద్ధ విమానాలు కూల్చేశాం.. IAF చీఫ్ సంచలన వ్యాఖ్యలు
అందులో భాగంగా 26 బోయింగ్ 787-8 విమానాలలో తొలి విమానం జూలైలో కాలిఫోర్నియాలోని బోయింగ్ ఫ్యాక్టరీకి చేరుకుంటుంది. రెండవ విమానం అక్టోబర్‌లో అమెరికాకు వెళ్తుంది. ఈ విమానాలలో కొత్త ఇంటీరియర్స్, అత్యాధునిక వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు. ప్రతి క్యాబిన్‌లో కొత్త సీట్లు, అధునాతన ఇన్-ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ (IFE) వ్యవస్థలు, కొత్త కార్పెట్‌లు, కర్టెన్లు, అప్హోల్స్టరీ, టాయిలెట్‌లు ఉంటాయి. ఇలా అన్ని రకాల మార్పులతో ప్రయాణీకులకు అద్భుతమైన సౌకర్యాలను అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
త్వరలో విమాన సర్వీసుల పునరుద్ధరణ
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ఇండియా పలు విమానాలను రద్దు చేసింది. ప్రస్తుతం వాటిని తిరిగి పునరుద్దరించాలని నిర్ణయించింది.తన అంతర్జాతీయ విమాన సర్వీసుల కార్యకలాపాలను దశల వారీగా పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీసులను మళ్లీ పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది. ఈ మేరకు బుధవారం ఎయిర్ ఇండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ ప్రకటన పేరుతో విడుదల చేసింది. అయితే వీటిని ప్రారంభించే ముందు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి.. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని, పూర్తి విశ్వాసంతో విమాన సర్వీసులను నడుపుతామని ఆయన వెల్లడించారు.
ఇది కూడా చూడండి:Shrishti Fertility Center: సృష్టి కేసులో ఈడీ రంగ ప్రవేశం.. భారీగా నిధులు తరలింపుపై అనుమానాలు
అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత ఎయిర్ ఇండియా సంస్థ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మాట వాస్తమని ఆయన స్పష్టం చేశారు. ఆ క్రమంలో ఆగస్ట్ 05 న కోల్‌కతా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీస్ రెండు గంటల ఆలస్యంగా బెంగళూరులో దిగాల్సి వచ్చిందన్నారు. అలాగే సింగపూర్, చెన్నై సర్వీస్‌ను సైతం రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇక మీదట భవిష్యత్తులో తమ సంస్థ నడిపే విమాన సర్వీసులన్నీ సజావుగా సాగేలా చర్యలు చేపడతామని ఎయిర్ ఇండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి:Palnadu Ragging: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ! వీడియో వైరల్