/rtv/media/media_files/2025/08/10/trump-tariffs-effect-2025-08-10-08-12-52.jpg)
Trump Tariffs effect
డోనాల్డ్ ట్రంప్ సుంకాలు జోరుగా అమలులో ఉన్నాయి అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ లు పెడుతున్నారు అమెరికన్లు. ఇందులో మెర్సిడెస్ చాండ్లర్ అనే యూజర్ పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో వాల్ మార్ట్ లో ధరలు పెరిగాయి అంటూ ఆమె వీడియో పెట్టింది. వాల్ మార్ట్ లో దుస్తులు, ఇతర వస్తువులపై ధరలు పెరిగాయని తెలుస్తోంది. పాత ట్యాగ్ లు తీసేశారు. వాటి మీద కొత్త ధరలు పెట్టారు అంటూ ఆమె క్లియర్ గా చూపించింది. ట్రంప్ సుంకాల వల్లనే ధరలకు రెక్కలొచ్చాయని చాండ్లర్ అందులో క్లియర్ గా చెప్పింది. ప్రస్తుతానికి అన్ని వస్తువులపైనా డాలర్ పెరిగింది. పిల్లల బట్టల మీద అయితే ఏకంగా నాలుగు డాలర్ల పెరుగుదల కనిపించింది. అలాగే మొదట $19.97కి అమ్ముడైన బ్యాక్‌ప్యాక్ ఇప్పుడు $24.97కి చేరుకుంది అని చాండ్లర్ చెబుతున్నారు. ఇదే పరిస్థితి టార్గెట్ లో కూడా ఉందని ఆమె తెలిపింది. కావాలంటే మీరే వెళ్ళి చెక్ చేసుకోండి అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు.
ట్రంప్ ను ఎండగడుతున్న అమెరికన్లు..
ఈ వీడియోపై చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. ట్రంప్ చేస్తున్న పని విలువైనదేనా..మనం ఇంకా గొప్పవాళ్ళం అనుకుంటున్నారా అంటూ అమెరికన్లు కామెంట్లు పెడుతున్నారు. అమెరికాలోని మాగా వ్యవహారాన్ని దుయ్యబడుతున్నారు. టార్గెట్ లో పని చేసే ఒక వ్యక్తి కూడా ధరలు పెరుగుదల నిజమేనని చెబుతున్నారు. కొన్ని రోజులుగా దుస్తులపై ఉన్న పాత ట్యాగ్ లను తొలగించి..కొత్త వాటిని పెడుతున్నామని చెప్పారు. వావ్..సుంకాల వలన మనకు బిలియన్లు వచ్చేస్తున్నాయి. దానికి కోసం ఎక్కువ డబ్బులు చెల్లిద్దాం అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు మరొక నెటిజన్.
Also Read: Trump Vs BRICS: ట్రంప్ vs బ్రిక్స్..వాణిజ్య యుద్ధంలో గెలిచేదెవరు?