/rtv/media/media_files/2025/08/10/pakistan-closed-2025-08-10-15-45-49.jpg)
Pakistan
భారత్ దెబ్బకు శత్రు దేశం పాకిస్తాన్ అన్నీ విదాల నష్టపోతుంది. ఇండియా, పాక్ యుద్ధంలో పాకిస్థాన్ భారీగా నష్టాన్ని చవిచూసింది. ఆపరేషన్ సింధూర్‌లో పాక్ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయి. అలాగే సింధూ నదీ జలాల ఒప్పందం రద్దుతో నీటి సంక్షోభాన్ని ఎదుర్కోంటుంది. తాజాగా మరో నష్టం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్‌లోకి భారత విమానాలు రాకుండా గగనతలాన్ని మూసివేసింది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్‌కు భారీ ఆర్థిక నష్టాన్ని వాటిల్లింది. గడచిన రెండు నెలల్లో పాకిస్తాన్‌కు దాదాపు రూ.1,240 కోట్ల (పాకిస్తాన్ కరెన్సీలో 30 బిలియన్లు) నష్టం వాటిల్లినట్లు పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్‌లో వెల్లడించింది.
Pakistan has suffered losses of 127 crore rupees between April 24 and June 30 after closing its airspace to Indian aircraft. The figures were shared in Pakistan’s National Assembly this week. #Pakistan#Indianairspacepic.twitter.com/YJCXAGE1tn
— All India Radio News (@airnewsalerts) August 10, 2025
భారతీయ విమానాలకు పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు అనుమతి నిరాకరించడంతో, పాకిస్తాన్‌కు ఓవర్‌ఫ్లైట్ ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. గతంలో జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసినప్పుడు కూడా ఇలాంటి నష్టాలే చవిచూసింది. అయితే, ఈసారి నష్టం మరింత తీవ్రంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. అంతర్జాతీయ మార్గాల్లో పయనించే భారత విమానాలు ఎక్కువగా పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించుకునేవి. ఒక దేశ గగనతలం మీదుగా ప్రయాణించినప్పుడు ఆ దేశానికి చెల్లించే ఓవర్‌ఫ్లైట్ ఫీజులు పాకిస్తాన్‌కు పెద్ద ఆదాయ వనరుగా ఉండేవి.
తాజా ఆంక్షల కారణంగా, భారత విమానాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చింది. ఇది ప్రయాణ సమయాన్ని, ఇంధన ఖర్చులను పెంచింది. ముఖ్యంగా ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి భారతీయ విమానయాన సంస్థలు తమ విమానాల రూట్‌లను మార్చుకోవడంతో భారీగా నష్టపోయాయి. అయితే, పాకిస్తాన్ నిర్ణయం వల్ల పాక్‌కు కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఇప్పుడు తేటతెల్లమైంది. ఈ ఘటన ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలను మరింత పెంచడంతో పాటు, ఆర్థికంగా పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకోకపోతే ఇలాంటి నష్టాలు భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.