Rajani Style: సింగపూర్ లో రజనీకాంత్ మేనియా..నేషనల్ డే కవాతుకు స్పెషల్ రీల్

రజనీకాతం అంటేనే ఓ క్రేజ్. ఆయన స్టైల్ కు పడిపోని వారంటూ ఎవరూ ఉండరు. తాజాగా సింగపూర్ లో పోలీసులు రజనీకాంత్ వాకింగ్ స్టైల్ ను అనుకరిస్తూ రీల్ చేశారు. ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. 

New Update
singapore

Singapore Police

తలైవా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. రజనీ చేసే స్టైల్స్ కు అందరూ ఫ్యాన్సే. ఆయనకు మన దేశంలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే రజనీ కు మిగతా దేశాల్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో సింగపూర్ ఒకటి. రజనీ కాంత్ సినిమాలు అన్నీ అక్కడి భాషలోకి డబ్ కూడా అవుతాయి. ఇప్పుడు ఆగస్ట్ 15 న రిలీజ్ అయ్యే కూలీ కూడా అక్కడ విడుదల అవనుంది. ఈ సందర్భంగా సింగపూర్ పోలీసులు ఒక స్పెషల్ రీల్ చేశారు. అక్కడి నేషనల్ డే కవాతు సందర్భంగా రజనీ కాంత్ స్టైల్ వాక్ చేస్తూ రీల్ చేశారు. రజనీ తాజా చిత్రం కూలీలోని ‘పవర్‌హౌస్‌’ పాటకు సింగపూర్‌ పోలీసులు ఒకరి తర్వాత మరొకరు తలైవా తీరులో స్టైలుగా చకచకా నడుస్తూ పోజులిచ్చారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.     

సింగపూర్ పోలీసులు రజనీ స్టైల్ ను అనుకరించడం ఇదే మొదటిసారి కాదు. అంతకు ముందు కూడా ఒక పోలీస్ ఆయన డైలాగ్, ఫోజులతో ఒక రీల్ చేశారు. అప్పట్లో అది కూడా చాలా వైరల్ అయింది. 

ఆగస్టు 15న రజనీ కూలీ రిలీజ్..

టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో(Rajinikanth) కలసి తెరకెక్కించిన భారీ ప్రాజెక్ట్ ‘కూలీ’తో(Coolie Movie) ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుండటంతో, ప్రమోషన్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో, లోకేశ్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం 2 ఏళ్ల ప్లాన్! (Coolie Interval)

లోకేశ్ మాట్లాడుతూ - "ఇది నా మొదటి సినిమా రజనీ సార్‌తో... అందుకే ఈ సినిమాకు ఇంటర్వెల్ సీన్ చాలా స్పెషల్ గా ఉండాలని రెండేళ్ల పాటు ప్లాన్ చేశాను. సినిమా విడుదలైన తర్వాత ఆ సీన్‌కి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అనేదే నాకు చాలా ఆసక్తిగా ఉంది" అని చెప్పారు. దీనితో, ‘కూలీ’లో ఇంటర్వెల్ సీన్ పై భారీ హైప్ పెరిగింది.

Advertisment
తాజా కథనాలు