Rahul Gandhi: ఎన్నికల సంఘంపై యుద్ధం.. మరో సంచలన డిమాండ్ చేసిన రాహుల్‌ గాంధీ

రాహల్‌ గాంధీ మరోసారి ఎన్నికల సంఘాన్ని ఎక్స్‌ వేదికగా టార్గెట్‌ చేశారు. డిజిటల్ ఓటర్ లిస్టును బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. ఓటు చోరీ అనేది ఒక వ్యక్తి, ఓటు అనే ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రంపై దాడి చేయడమేనన్నారు.

New Update
Rahul Gandhi Demands EC to Show Transparency Make The Digital Voter List Public

Rahul Gandhi Demands EC to Show Transparency Make The Digital Voter List Public

ఎన్నికల సంఘం, బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని ఇటీవల విపక్ష నేత రాహుల్‌ తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ప్రస్తుతం ఎన్నికల సంఘం పారదర్శకత వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో రాహల్‌ గాంధీ మరోసారి ఎన్నికల సంఘాన్ని ఎక్స్‌ వేదికగా టార్గెట్‌ చేశారు. డిజిటల్ ఓటర్ లిస్టును బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు.  ఓటు చోరీ అనేది ఒక వ్యక్తి, ఓటు అనే ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రంపై దాడి చేయడమేనన్నారు. స్వేచ్ఛ, నిష్పాక్షికమైన ఎన్నికకు క్లియర్ ఓటరు లిస్ట్‌ అవసరమన్నారు.

Also Read: తీసుకున్న సొంత గొయ్యిలో పడ్డ పాకిస్తాన్.. 2 నెలల్లో రూ.1,240 కోట్లు నష్టం

 మా డిమాండ్ ఎన్నికల కమిషన్‌కు స్పష్టంగా ఉందని.. డిజిటల్ ఓటర్ లిస్టును బయటపెట్టాలన్నారు. ఈసీ పారదర్శకతను చూపించాలని తెలిపారు. దీనివల్ల ప్రజలు, రాజకీయ పార్టీలు స్వయంగా ఆడిట్‌ చేయగలవని చెప్పారు. మీరు కూడా మాతో జతకూడి ఈ డిమాండ్‌కు మద్ధతివ్వాలని చెప్పారు. votechori.in/ecdemand వెబ్‌సైట్‌లోకి వెళ్లాలని లేదా 9650003420 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. మన ప్రజాస్వా్‌మ్యాన్ని రక్షించడం కోసమే ఈ పోరాటమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి భారీ మోసానికి పాల్పడినట్లు విమర్శలు చేశారు. 

Also Read: అమెరికా పతనం మొదలైంది..సుంకాల తర్వాత వాల్ మార్ట్ లో ధరల పెరుగుదల

Also Read: విమానంలో ప్రయాణికురాలికి 'డర్టీ' సీటు.. ఇండిగో సంస్థకు భారీ జరిమానా

కర్ణాటకలోని మహాదేవపురం నియోజకవర్గం ఓటరు జాబితా వివరాలు వెల్లడించారు. కేవలం ఆ ఒక్క నియోజకవర్గంలోనే లక్షకు పైగా నకిలీ ఓట్లను గుర్తించినట్లు చెప్పారు. అందుకే ఈ లోక్‌సభ స్థానంలో బీజేపీ గెలిచినట్లు మండిపడ్డారు. 70 నుంచి 100 సీట్లలో ఇలాంటి మోసమే జరిగితే ఇది స్వేచ్ఛాయుత ఎన్నికలను నాశనం చేస్తుందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అంతేకాదు తమ వద్ద ఆధారాలున్నాయని.. ఓట్ల దొంగతనంపై తాము పోరాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తమతో కలిసి రావాలని కోరారు. ఒక వ్యక్తి పోర్టల్‌లో నమోదు చేసుకునే సమయంలో ఓటు దొంగతనంకు వ్యతిరేకమని పేర్కొంటూ అతని పేరుపై ఓ సర్టిఫికేట్‌ జారీ చేయబడుతుందని చెప్పారు. ఈసీ నుంచి డిజిటల్ ఓటరు జాబితా కోసం రాహుల్‌ డిమాండ్‌కు మద్దతిస్తున్నానని ఆ సర్టిఫికేట్‌లో ఉంటుందని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు