/rtv/media/media_files/2025/05/07/53jUpPipqT2WCQ2xg1GL.jpg)
Maoist Killed in Bijapur
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సాగుతోన్న ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించినట్లే దేశవ్యాప్తంగా మావోయిస్టుల స్థావరాలమీదా భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇప్పటికే మావోయిస్టులకు స్థావరాలుగా పేరున్న అబుజ్ మడ్, ఛత్తీస్‌గఢ్, నేషనల్ పార్క్, కర్రె గుట్టలపై భద్రతా దళాలు పై చేయి సాధించాయి. ఆయా ప్రాంతాల్లో సాగిన ఎన్ కౌంటర్లలో పలువురు అగ్రనేతలు మృతి చెందారు.
Also Read: రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం
Also Read : Vakiti Srihari : నాకు గొర్రెలు, బర్రెల శాఖలిస్తే ఏం చేసుకోవాలి.. మంత్రి వాకిటి సంచలన కామెంట్స్!
Encounter In Bijapur - Key Maoist Leader Killed - Amith Shah
తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఈ రోజు మరో ఎన్‌కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ అటవీప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ కూంబింగ్ లో మావోయిస్టులు ఎదురు పడటంతో రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు నేత సోంది కన్నా మృతి చెందారు. మరికొంతమంది మావోలు అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. కానీ, ఎన్ కౌంటర్ ప్రాంతంలో 303 రైఫిల్, భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.
Also Read: పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ
Also Read : Jyoti Malhotra : పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..
maoist | Encounter In Bjapur | encounter-at-chhattisgarh | encounter | Chhattisgarh Encounter Latest Updates | bijapur naxalite encounter | chattisgarh encounter | bijapur naxal encounter | bijapur-encounter-case | bijapur encounter