Jyoti Malhotra : పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..

పాకిస్థాన్ కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన హర్యానా వ్లాగర్ జ్యోతి మల్హోత్రా గురించిన సంచలన విషయం వెలుగు చూసింది. కేరళ పర్యాటక రంగ ప్రోత్సహక ప్రచారంలో జ్యోతి పాల్గొనడమే కాకుండా అతిథిగా భాగస్వామ్యం వహించారనే విషయాలు బయటపడ్డాయి.

New Update
Jyoti Malhotra was hosted by Kerala

Jyoti Malhotra was hosted by Kerala

Jyoti Malhotra : దేశ భద్రతను ఫణంగా పెట్టి పాకిస్థాన్ కు గూఢచర్యం చేసిందని ఆరోపణలతో అరెస్ట్ అయిన హర్యానాకు చెందిన వ్లాగర్ జ్యోతి మల్హోత్రా గురించిన మరో సంచలన విషయం వెలుగు చూసింది. కేరళ పర్యాటక రంగ ప్రోత్సహక ప్రచారంలో జ్యోతి పాల్గొనడమే కాకుండా అతిథిగా భాగస్వామ్యం వహించారనే సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ విషయమై సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద కొంతమంది అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం రావడం కలకలం రేపింది. 

Also Read : ప్రేమికుల సూసైడ్...పెద్దలు ఒప్పుకోలేదని బ్లేడ్ తో కోసుకుని..

Pakistan Spy Jyoti Malhotra

దక్షిణాదిని పర్యాటకంపరంగా ప్రోత్సహించేందుకు కేరళ అతిథులుగా ఎంపిక చేసిన 41 మంది ఇన్‌ఫ్లుయెన్లర్లలో జ్యోతి మల్హోత్రా కూడా ఒకరని తేలింది. వీరి పర్యటనకు కేరళ ప్రభుత్వం నిధులు సమకూర్చడంతో పాటు వారి ప్రయాణం, వసతి, ఆహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించిదని తేలింది. అక్కడి పర్యాటక ప్రాంతాల వీడియోలను చిత్రీకరించడంలో వారికి సహాయం చేయడానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీని కూడా ప్రభుత్వం నియమించినట్లు ఆర్టీఐకి వచ్చిన సమాధానంలో తేలింది.

Also Read : జూబ్లీహిల్స్ లో బీజేపీదే గెలుపు.. ఆ పార్టీ చీఫ్ రామచందర్‌రావు చెప్పిన లాజిక్ ఇదే!

కేరళలో పర్యటించిన జ్యోతి మల్హోత్రా  కొచ్చి, కన్నూర్, కోజికోడ్, అలప్పుజ, మున్నార్, తిరువనంతపురం ప్రాంతాలను సందర్శించినట్లు తెలిసింది. వీటికి సంబంధించిన వ్లాగ్‌లను ఆమె తన యూట్యూబ్‌ ఛానల్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో షేర్ చేసింది కూడా. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత గత మే నెలలో ఆమెను అరెస్టు చేశారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌ను సందర్శించారని పోలీసుల విచారణలో తేలింది.

Also Read : HYDలో గుండె పగిలే విషాదం.. కాలికి సర్జరీ.. గుండెపోటుతో బాలుడు మృతి

ఈ విషయం తెలిసి కేరళ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా తీవ్రవాదులకు సహకరించే గూఢచారులను కేరళ పొంచి పోషించిందని ఆరోపిస్తున్నారు.అయితే ఈ విషయంలో స్పందించిన అక్కడి ప్రభుత్వం పర్యాటక మంత్రి  పీఏ మహమ్మద్ రియాస్ మాట్లాడుతూ కేరళకు ఇతర ఇన్‌ఫ్లుయెన్లర్లతో పాటు జ్యోతిని ఆహ్వానించారన్నారు. ఇది కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో చేసిన ప్రయత్నమన్నారు. ఇది పారదర్శకంగా, మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమమని, అయితే వచ్చిన వారిలో గూఢచారులున్నారని ముందుగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యపడదని స్పష్టం చేశారు.కాగా పాక్‌కు భారత రహస్యాలను చేరవేశారనే అభియోగాల కింద జ్యోతితో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో మరో 12 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..

Also Read : అఘోరీకి వెన్నుపోటు పొడిచిన శ్రీవర్షిణి.. న్యూ లుక్ చూశారా?

Jyoti Malhotra Pakistan Spy Case | jyoti malhotra pakistan | jyoti malhotra news | Jyoti Malhotra crime | jyoti malhotra big update | breaking news Jyoti Malhotra | rti | kerala

Advertisment
Advertisment
తాజా కథనాలు