తనకు కేటాయించిన శాఖలపై మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కింద తనకిచ్చిన ఇచ్చిన ఐదు శాఖలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి అదృష్టమో దురదృష్టమో అర్ధం అవ్వడం లేదన్నారు. తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయన్న ఆయన.. ఐదు శాఖలూ ఆగమాగంగానే ఉన్నాయని బహిరంగంగానే వెల్లడించారు. యువజన సర్వీసులు ఇస్తే తానేం చేసుకోవాలి అని ప్రశ్నించారు.
Also Read :'అందులో తప్పేముంది'.. సీఎం పదవిపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
Also Read : మంత్రి ఆనం Vs నారాయణ.. పేలిన మాటల తూటాలు
ఆగమైన శాఖలను అప్పగించారు
గొర్రెలు, బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. గత పదేళ్లలో ఆగమైన శాఖలను తనకు ఇచ్చారని అన్నారు. ఇందులో పళుసంవర్థకశాఖ గందరగోళంగా ఉందని తెలిపారు. గందరగోళంగా ఉన్న శాఖలను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాలాకి విచ్చేసిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
అంతకుముందు కరీంనగర్‌లో క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. క్రీడా పాఠశాలల అంతర్గత పోటీలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. కబడ్డీ, హ్యాండ్ బాల్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్‌లో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ క్రీడా పాఠశాలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు.
Also read : Akash Deep Sister: క్యాన్సర్ విషయం చెప్తాడని అనుకోలేదు.. ఆకాశ్‌దీప్ సోదరి ఎమోషనల్
Also Read : అయ్యో బిడ్డా.. తెలంగాణలో ప్రాణం తీసిన ఫ్యాన్.. 9 ఏళ్ల చిన్నారి మృతి
vakiti srihari | karimnagar | telangana | telugu-news
Vakiti Srihari : నాకు గొర్రెలు, బర్రెల శాఖలిస్తే ఏం చేసుకోవాలి.. మంత్రి వాకిటి సంచలన కామెంట్స్!
తనకు కేటాయించిన శాఖలపై మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కింద తనకిచ్చిన ఇచ్చిన ఐదు శాఖలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయన్న ఆయన.. ఐదు శాఖలూ ఆగమాగంగానే ఉన్నాయని వెల్లడించారు.