/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/111988366-transformed-1.webp)
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్ స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతి లభించింది. ఈ మేరకు టెలికాం శాఖ ఆ సంస్థకు లైసెన్సును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశంలో ఈ లైసెన్స్ అందుకున్న మూడో సంస్థగా స్టార్‌లింక్ నిలిచింది. దరఖాస్తు చేసుకున్న 15-20 రోజుల్లోనే ట్రయల్ స్పెక్ట్రమ్ మంజూరు చేస్తామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వర్గాలు తెలిపాయి.
Also Read : సైలెంట్ గా ఓటీటీలోకి 'సింగిల్' ఎంట్రీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే
Also Read : తెలంగాణలో దంచికొడుతున్న భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో వానలే వానలు!
Elon Musk Starlink
#JustIn | Department of Telecommunications (DoT) issues license to Elon Musk's #Starlink for SatComm ops in India.
— CNBC-TV18 (@CNBCTV18Live) June 6, 2025
Alert🚩: DOT yet to approve TRAI recommendations for Sat Comm spectrum
TRAI has recommended administrative allocation of spectrum for SatComm players
TRAI has… pic.twitter.com/AZVgQa6ydQ
భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి రిలయన్స్ జియోకు చెందిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, అలాగే భారతీకి చెందిన వన్‌వెబ్ లైసెన్స్‌ను పొందాయి. ఇప్పుడు స్టార్‌లింక్ కూడా ఈ జాబితాలో చేరడంతో భారతదేశంలోని మారుమూల ప్రాంతాలతో సహా ఎక్కడైనా హై-స్పీడ్ ఇంటర్నెట్ లభించే అవకాశాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి. ఫైబర్ ఆప్టిక్ లేదా మొబైల్ టవర్ మౌలిక సదుపాయాలు చేరుకోలేని గ్రామీణ, కఠినమైన భౌగోళిక ప్రాంతాలకు శాటిలైట్ ఇంటర్నెట్ ఒక గేమ్-ఛేంజర్ కానుంది. స్టార్‌లింక్ ఎంట్రీ దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో పోటీని పెంచుతుంది, ఇది వినియోగదారులకు మెరుగైన నాణ్యత అందించడంతో పాటుగా అందుబాటు ధరల్లోనే లభించే అవకాశాలు ఉంటాయి. ఎలాన్ మస్క్ స్టార్‌లింక్.. ప్రపంచవ్యాప్తంగా తన వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు ప్రసిద్ధి చెందింది.
Also Read : ఆపరేషన్ సిందూర్ పేరు వింటే పాకిస్తాన్‌కు అదే గుర్తువస్తుంది: PM మోదీ
Also Read : వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు
starlink launch | national news in Telugu | international news in telugu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu