#Single Ott: శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్ టైనర్ సింగిల్ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వేసవి కానుకగా మే లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నవ్వులు పూయించింది. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కార్తీక్ రాజు తెరకెక్కించాడు. యంగ్ బ్యూటీస్ కేతిక శర్మ, ఇవానా ఫీమేల్ లీడ్స్ గా నటించారు.
#Single has now brought the ultimate madness & laughter-packed blast to your homes❤️🔥👑
— Geetha Arts (@GeethaArts) June 6, 2025
Enjoy the sensational summer blockbuster #SingleMovie now on @PrimeVideoIN 💥😎
▶️ https://t.co/L1oOAAGIX3 pic.twitter.com/0QH0ZgbH0H
బాక్సాఫీస్ వద్ద సూపర్ రెస్పాన్స్
చిన్న సినిమాగా, అతి తక్కువ విడుదలైన సింగిల్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి వెన్నెల కిషోర్ పాత్ర మేజర్ ప్లస్ పాయింట్ కాగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం కి మంచి మార్కులు పడ్డాయి. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలిసి నిర్మించారు. అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పణ అందించారు.